Home /News /crime /

TELANGANA TEENAGE GIRL DRINKS SANITIZER AFTER LOVER DENAY TO MARRY HER IN KHAMMAM DISTRICT SU

Telangana: నాలుగేళ్ల ప్రేమ.. శానిటైజర్ తాగిన యువతి.. అందుకే ఇలా చేస్తున్నాను..

శానిటైజర్ తాగిన యువతి

శానిటైజర్ తాగిన యువతి

నాలుగేళ్ల ప్రేమ.. అతనితో కలిసి ఏడడుగులు వేయాలని చూసింది ఓ యువతి. మిగిలిన జీవితాన్ని అతనితోనే గడపాలని కలలు కనింది.

    నాలుగేళ్ల ప్రేమ.. అతనితో కలిసి ఏడడుగులు వేయాలని చూసింది ఓ యువతి. మిగిలిన జీవితాన్ని అతనితోనే గడపాలని కలలు కనింది. అయితే ప్రేమించిన వాడు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిరునోముల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన సింధు, రావినూతలకు చెందిన వేణు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమిస్తున్న సమయంలో వేణు.. సింధును శారీరకంగా లొంగిదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే కులాలు వేరు కావడంతో వేణు తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోలేదని సమాచారం.

    ఈ క్రమంలోనే సింధును శారీరకంగా వాడుకున్న వేణు.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. సింధుకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే వేణు నను శారీరకంగా లొంగదీసుకొని పెళ్లి చేసుకోకుండా మొహం చాటేస్తున్నాడని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పది రోజుల కిందట సింధు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనకు న్యాయం చేయాలని వేణు ఇంటిముందు రెండు సార్లు దీక్ష కూడా చేసింది. అయినా కూడా వేణు స్పందించకపోవడంో.. మనస్తాపం చెందిన సింధు శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలో వెళ్లింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.

    దళితురాలైనందున తనను పెళ్లి చేసుకునేందుకు ప్రియుడి తల్లిదండ్రులకు ఇష్టం లేదని.. అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సింధు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. వేణు తల్లిదండ్రులు కూడా తనను బూతులు తిట్టారని చెప్పింది. తనలా ఏ అమ్మాయికి అన్యాయం జరగకూడదని చెబుతూ సింధూ సెల్పీ వీడియో తీసుకుంటూ తీసుకొని శానిటైజర్ తాగింది. ఇక, ప్రస్తుతం సింధు పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా సమాచారం.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Attemp to suicide, Khammam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు