అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు... భార్యనూ అదే గొడ్డలితో వెంటాడి వేటాడి...

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం... మద్యానికి బానిసై భార్యకు చిత్రహింసలు చూపిస్తున్న భర్త... వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిన మహిళ... ఎంత చెప్పినా తిరిగి రాకపోవడంతో...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 16, 2019, 11:11 AM IST
అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు... భార్యనూ అదే గొడ్డలితో వెంటాడి వేటాడి...
అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు... భార్యకి అడ్డు వచ్చిందని...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 16, 2019, 11:11 AM IST
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మద్యానికి పుల్లుగా బానిసైన ఓ వ్యక్తి... అత్తను అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. స్థానికంగా కలకలం క్రియేట్ చేసిన ఈ సంఘటన భూపాల్‌పల్లి జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపురం గ్రామంలో జరిగింది. చెన్నాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్‌కు, అదే గ్రామానికి చెందిన సుజాత అనే యువతితో కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. మొదట్లో బాగానే ఉన్న ప్రభాకర్, ఈ మధ్య తాగుడికి బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి, భార్యను తిడుతూ కొడుతూ వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన సుజాత... అదే గ్రామంలో ఉన్న తల్లిగారింటికి వెళ్లిపోయింది. మంగళవారం రాత్రి భార్యను తీసుకురావడానికి అత్తింటికి వెళ్లారు ప్రభాకర్. అయితే అక్కడికి కూడా ఫుల్లుగా తాగి రావడంతో అతనితో వెళ్లేందుకు సుజాత అంగీకరించలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎంత చెప్పినా వినకపోవడంతో తీవ్ర ఆవేశానికి లోనైన ప్రభాకర్... ఇంటి బయట ఉన్న గొడ్డలి తీసుకుని భార్యపై దాడి చేశాడు. కూతురిపైకి అల్లుడు గొడ్డలి ఎత్తడం గమనించిన సుజాత తల్లి లక్ష్మీ... అతనికి అడ్డు వెళ్లింది. భార్య కొడుతుంటే అడ్డు వచ్చిన అత్తపై కోపంతో రగిలిపోయిన ప్రభాకర్... గొడ్డలితో అత్త మెడపై బలంగా వేటు వేశాడు.

తర్వాత సుజాతను కూడా వెంబడించి గాయపరిచాడు. ప్రభాకర్ చేస్తున్న దారుణాన్ని తట్టుకోలేక సుజాత అరుస్తూ కేకలు వేసింది. దాంతో అక్కడికి చేరుకున్న స్థానికులు... ప్రభాకర్‌ను అడ్డుకుని, సుజాతను కాపాడారు. గొడ్డలి వేటు బలంగా పడడంతో తీవ్ర రక్తస్రావమైన లక్ష్మీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన సుజాతను స్థానిక ఆసుపత్రికి తరలించిన గ్రామస్థులు... పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన సుజాత పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...