పదో తరగతి విద్యార్థిని పొదల్లోకి తీసుకెళ్లి... ఇన్విజిలేటర్ అఘాయిత్యం...

సూర్యపేటలో వెలుగుచూసిన దారుణం... పరీక్షల్లో కాపీ కొట్టేందుకు బాలికకు ఇన్విజిలేటర్ సహకారం... ఎగ్జామ్ పూర్తయిన తర్వాత బైక్‌పై తీసుకెళ్లి, అత్యాచారయత్నం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 28, 2019, 10:16 PM IST
పదో తరగతి విద్యార్థిని పొదల్లోకి తీసుకెళ్లి... ఇన్విజిలేటర్ అఘాయిత్యం...
పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లి... ఇన్విజిలేటర్ అఘాయిత్యం... (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 28, 2019, 10:16 PM IST
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎంతో కష్టపడి చదువుతూ, పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే పదో తరగతి పరీక్షలు రాస్తున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పిన ఇన్విజిలేటర్... ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట జిల్లాలో తీవ్ర కలకలం క్రియేట్ చేసింది. సూర్యపేట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి చదువుతున్న బాలికకు సూర్యపేట హైవే సమీపంలో గల ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఎగ్జామ్ సెంటర్ పడింది. అదే పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించేందుకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడు... ఆమెతో చనువుగా మాట్లాడాడు. విద్యార్థినికి పరీక్షల్లో కాపీ కొట్టేందుకు సాయం కూడా చేశాడు. దాన్ని ఆసరాగా చేసుకుని పరీక్ష పూర్తయిన తర్వాత బయట కలవాలని ఆమెకు చెప్పాడు. అతని మాటలు నమ్మిన బాలిక... పరీక్ష పూర్తయిన తర్వాత ఇన్విజిలేటర్ కోసం స్కూల్ బయట వేచి చూసింది.

బైక్ తీసుకుని బాలిక దగ్గరికి వచ్చిన సదరు ఇన్విజిలేటర్... ఇంటి దగ్గర దింపుతానని చెప్పి బాలికను ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు పక్కన బైక్ ఆపి, బాలికను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకున్న బాలిక... ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన పెద్దమ్మకు చెప్పింది. తల్లిదండ్రులు బాలికను చదివిస్తున్న ఆమె పెద్దమ్మ... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు... సదరు టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు వాపసు తీసుకుంటే బాలికకు, ఆమె పెద్దమ్మకు కొంత డబ్బు నష్టపరిహారంగా ఇస్తామని సదరు టీచర్ కుటుంబసభ్యులు, స్నేహితులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది.
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...