TELANGANA SECURITY CHEATS ADDITIONAL COLLECTOR IN JOGULAMBA GADWAL DISTRICT HERE FULL DETAILS NS MBNR
Telangana: ఏకంగా అదనపు కలెక్టర్ డబ్బులకే స్కెచ్.. నమ్మి ఏటీఎం కార్డు ఇచ్చినందుకు ఆ సెక్యూరిటీ గార్డు ఏం చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
నమ్మి ఏటీఎం(ATM Card) కార్డు ఇచ్చినందుకు ఆ సెక్యూరిటీ గార్డు ఏకంగా అడిషినల్ కలెక్టర్ కే స్కెచ్ వేశాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో పోలీసుల(Police)కు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏకంగా అడిషనల్ కలెక్టర్(Additional Collector) కే కుచ్చుటోపి పెట్టాడో సెక్యూరిటీ గార్డు. నమ్మి పిన్ నంబర్ చెప్పిన పాపానికి నిండా ముంచేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనతెలంగాణ(Telangana) రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల(Gadwal) జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న రఘురామ శర్మ ఇంట్లో గద్వాల పట్టణానికి చెందిన రాజు సెక్యూరిటీ గార్డుగా కొంతకాలంగా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో తీరిక దొరకకపోవడంతో పలు సందర్భాల్లో తనకు అవసరం ఉన్నప్పుడు డబ్బుల తీసుకురమ్మని ఏటీఎం కార్డు(ATM Card)ను రాజుకు ఇచ్చేవాడు. దీంతో రాజుకు సీక్రెట్ పిన్ నంబర్ సైతం చెప్పాడు. అయితే.. అత్యంత నమ్మకంగా వ్యక్తిగా నటిస్తూ అదనపు కలెక్టర్ చెప్పిన సమయాల్లో డబ్బులు ఏటీఎం ద్వారా తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు.
కాలక్రమేణ డబ్బులపై ఆశతో ఎలాగైనా పిన్ నంబర్ తెలుసు కాబట్టి ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసి వాడుకోవాలని భావించాడు. స్థానికంగా ఉండే ఏటీఎంలలో డబ్బులు విత్ డ్రా చేస్తే దొరుకుతానేమోనని అనుకున్నాడేమో వనపర్తి లో 40 వేల రూపాయలను విడతలవారీగా ఉపసంహరించుకున్నాడు. తిరిగి ఏమితెలియనట్లు ఇంటి వద్ద విధులు నిర్వహిస్తూ వచ్చాడు. అయితే.. ఏటీఎం కార్డు నుంచి 40 వేల రూపాయలు డబ్బులు ఉపసంహరించుకున్నట్లు అదనపు కలెక్టర్ రఘురామ శర్మ ఫోన్ కు మెసేజ్ లు రావడంతో ఆయన అలర్ట్ అయ్యారు. Theft in Temple : చేసింది గుళ్లో దొంగతనం.. అయినా.. అమ్మవారి మీద భక్తి ఎక్కువే.. వైరల్గా మారిన వీడియో..
వెంటనే గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కలెక్టర్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేయడంతో తాను అదనపు కలెక్టర్ ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీసుకున్నది వాస్తవమేనని అంగీకరించాడు అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గద్వాల పట్టణ ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.