సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం...స్పాట్‌లోనే ఒకరు మృతి

బస్సు బ్రేకులు ఫెయిలవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు, ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అదుపు తప్పిన బస్సు 500 మీటర్లు అలాగే ముందుకెళ్లి..మెట్రో పిల్లరను ఢీకొట్టి ఆగిందని వెల్లడించారు.

news18-telugu
Updated: January 12, 2019, 10:26 PM IST
సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం...స్పాట్‌లోనే ఒకరు మృతి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 12, 2019, 10:26 PM IST
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆటోతో పాటు పలు బైక్స్‌పైకి దూసుకెళ్లింది. ప్యాట్నీ సిగ్నల్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపు బస్సు వెళ్తుండగా.. క్లాక్ టవర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్‌లో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడ్డవారని దానమ్మ (ఆలేరు), శ్రీనివాస్ (బోయిన్‌పల్లి), శ్రీను (మేడ్చల్)గా గుర్తించారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియ రాలేదు.
ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు బ్రేకులు ఫెయిలవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు, ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అదుపు తప్పిన బస్సు 500 మీటర్లు అలాగే ముందుకెళ్లి..మెట్రో పిల్లరను ఢీకొట్టి ఆగిందని వెల్లడించారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...