దసరా వేళ ఆఫర్లతో సైబర్ నేరగాళ్ల మోసం.. ఇలా జాగ్రత్త పడండి..

ఆఫర్లు ప్రకటించే వెబ్‌సైట్ల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. ఆఫర్లను అదనుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు.. డబ్బులు దండుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

news18-telugu
Updated: October 4, 2019, 11:54 AM IST
దసరా వేళ ఆఫర్లతో సైబర్ నేరగాళ్ల మోసం.. ఇలా జాగ్రత్త పడండి..
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పండగ వస్తే చాలు.. ఈ కామర్స్ సంస్థలు బోలెడన్ని ఆఫర్లు, డిసౌంట్లు ప్రకటిస్తాయి. డబ్బులు ఆదా అవుతాయని మనం కూడా చకచకా ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేస్తుంటాం. అయితే, ఆఫర్లు ప్రకటించే వెబ్‌సైట్ల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. ఆఫర్లను అదనుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు.. డబ్బులు దండుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పండగ సీజన్‌లో ఆఫర్లు, డిస్కౌంట్లను ఎరగా వేసి మోసం చేయవచ్చని, జాగ్రత్త పడాలని తెలిపారు. ‘కొద్ది రోజుల ముందు మా వెబ్‌సైట్‌లో ఒక వస్తువు కొన్నారు. మీకు లాటరీ తగిలింది’ అంటూ వచ్చే ఫీడ్ బ్యాక్ కాల్స్ నమ్మవద్దని వెల్లడించారు. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ అని వచ్చే వాట్సాప్ మెసేజీలను అస్సలు నమ్మవద్దని తెలిపారు.

‘మీ క్రెడిట్ కార్డ్ పై ఆఫర్ ఇస్తున్నాం. మీ కార్డ్ వివరాలు చెప్పండి’ అని అడిగితే చెప్పవద్దని, గిఫ్ట్ కూపన్లు వస్తాయని చెబితే ఆశపడవద్దని, ముఖ్యంగా కూపన్లలో మీ వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని తెలిపారు. బోగస్ కంపెనీలు ఇచ్చే స్పెషల్ డీల్స్ నమ్మవద్దని, అదీకాక.. ఆఫర్ల కోసం గూగుల్‌లో వెతికి మోసపూరిత వెబ్‌సైట్ల బారిన పడి బలికావొద్దని సూచించారు.

First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు