భర్త హత్య కోసం భార్య ప్లాన్... వీడిన హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసు మిస్టరీ

Software Engineer Murder: భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకాలతో జీవించాలి. అలాంటిది ఆమె తన భర్తను ఎందుకు చంపాలనుకుంది. హత్యపై పోలీసులు ఏమన్నారు?

news18-telugu
Updated: November 25, 2020, 8:51 AM IST
భర్త హత్య కోసం భార్య ప్లాన్... వీడిన హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసు మిస్టరీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ... జగిత్యాల జిల్లా... మల్యాల మండలం... బల్వంతాపూర్‌ దగ్గర్లో సోమవారం జరిగిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రాచర్ల పవన్‌ కుమార్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం ఏడుగురిపై కేసు రాశారు. ఈ మర్డర్‌లో పవన్ కుమార్ భార్య కృష్ణవేణి హస్తమూ ఉందని తేల్చారు. అంతా ప్లాన్ ప్రకారం జరిగిన సినీమాటిక్ మర్డర్ ఇది. కృష్ణవేణి... సంవత్సరం కిందట ఆదిలాబాద్‌లోని బంధువుల పెళ్లికి వెళ్లింది. అక్కడ ఆమెకు చెందిన 6 తులాల బంగారు నగలను ఎవరో చోరీ చేశారు. ఇది ఆమె కాపురంలో చిచ్చురేపింది. అంత కాస్ట్‌లీ నగల విషయంలో జాగ్రత్తగా ఉండక్కర్లా... అవి పోయాయా... లేక నువ్వే ఎవరికైనా ఇచ్చేశావా... అంటూ ఆమెతో గొడవ పడేవాడు పవన్ కుమార్. అంతేకాదు... వాటిని తన బావమరిది జగన్‌ దొంగిలించి ఉంటాడని అనుమానిస్తూ... అతన్ని చంపేస్తానని భార్యతో అనేవాడు.

ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా... ఈమధ్య జగన్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. ఐతే... పవన్‌ కుమార్‌ చేతబడి చేయించడం వల్లే జగన్‌ చనిపోయాడని... బల్వంతాపూర్‌ శివారులో మంజునాథ ఆలయం, ఆశ్రమం నడుపుతున్న కృష్ణవేణి అన్నయ్య విజయ్‌స్వామి తన కుటుంబ సభ్యులకు పదే పదే చెప్పాడు. అదే నిజమని నమ్మింది కృష్ణవేణి. నా ఫ్యామిలీ జోలికొచ్చిన వాడు నా భర్త అయినా సరే ఎందుకు ఊరుకోవాలి... అనుకుంది. ఆల్రెడీ దాంపత్య జీవితంలో ఎన్నో గొడవలు ఉండటంతో... భర్తను చంపేయడమే కరెక్ట్ అనుకుంది కృష్ణవేణి.

Hyderabad Software engineer, hyd software engineer killed, black magic software, jagtial software engineer, software engineer set ablazed, జగిత్యాల సాఫ్ట్ వేర్ ఇంజినీర్, హైదరాబాద్ సాప్ట్ వేర్ ఇంజినీర్ సజీవదహనం,
పవన్ కుమార్ (File)


తన మనసులో ఆలోచనను కృష్ణవేణి... విజయ్‌స్వామితో పాటు తన మరదలు సుమలత, అక్క స్వరూప, అమ్మ ప్రమీలకు చెప్పింది. ఇలా చెయ్యడం కరెక్టు కాదమ్మా అని సర్దిచెప్పాల్సిన వాళ్లు... కృష్ణవేణికే వంతపాడారు. ఎలా చంపాలి అని అంతా ఆలోచించారు. ఓ ప్లాన్ ఆలోచించారు. అలా చేస్తే... ఎవ్వరికీ దొరికే ఛాన్స్ ఉండదు అనుకున్నారు.

ఇదీ ప్లాన్:
జగన్‌ ద్వాదశదిన కర్మ సందర్భంగా సోమవారం మంజునాథ ఆలయం పక్కన ఉన్న ఓ గదిలో జగన్‌ ఫొటోకి పవన్‌కుమార్‌ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాడు. ఆ సమయంలో తలుపులు మూసి, బయట తాళం వేశారు. ఆ తర్వాత కృష్ణవేణితో పాటు సమీప బంధువులు, కొండగట్టుకు చెందిన నిరంజన్‌రెడ్డి అనే యువకుడు కలిసి గది కిటికీ, జాలీలలో నుంచి పెట్రోలు పోశారు. దాంతో ఏదో జరుగుతోందని అర్థమైన పవన్ కుమార్... తనను చంపొద్దని వేడుకన్నాడు. జగన్ మరణానికి తాను కారణం కాదని మరీ మరీ చెప్పాడు. అప్పటికే అతన్ని చంపేయాలని బాగా ఫిక్సైన వాళ్లు... అతని మాటలు ఏమాత్రం వినలేదు. పెట్రోల్ పోసి... నిప్పంటించారు. దాంతో... ఆ మంటల్లోనే అతను సజీవ దహనం అయ్యాడు. పవన్‌కుమార్‌ తండ్రి గంగాధర్‌ కంప్లైంట్ ఇవ్వడంతో... దర్యాప్తు చేసిన పోలీసులు... కృష్ణవేణితో పాటు అయిదుగురు కుటుంబ సభ్యులు, కొండగట్టుకు చెందిన యువకుడిపై కేసు రాసినట్లు చెప్పారు.
Published by: Krishna Kumar N
First published: November 25, 2020, 8:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading