హోమ్ /వార్తలు /క్రైమ్ /

నిజామాబాద్‌లో కృష్ట జింకల వేట... హైదరాబాద్‌లో ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

నిజామాబాద్‌లో కృష్ట జింకల వేట... హైదరాబాద్‌లో ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

నిజామాబాద్‌లో కృష్ట జింకల వేట... హైదరాబాద్‌లో ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

నిజామాబాద్‌లో కృష్ట జింకల వేట... హైదరాబాద్‌లో ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

మూగ జీవాలను వేటాడి చంపి తింటున్నారు... లేదా అమ్మేస్తున్నారు... అలాంటి ముగ్గురు వేటగాళ్లను పక్కా ప్లాన్ వేసి హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇవీ...

నిజామాబాద్ జిల్లా నుంచి ముగ్గురు వేటగాళ్లు ఓ జింకను బంధించి... తీసుకొస్తుంటే... ఎవరో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతే... మేటర్ హైదరాబాద్ పోలీసులకు చేరింది. వెంటనే సౌత్ జోన్‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ప్లాన్ వేసి... జింకను కాపాడారు. దాన్ని పట్టుకొస్తున్న ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేశారు. ఆ వేటగాళ్లు మామూలోళ్లు కాదు. పులైనా తాను చూసిన జింకను వదిలేస్తుందేమో గానీ... వీళ్లు మాత్రం వదలరు. ఎలాగొలా పట్టుకుంటారు. ఆ తర్వాత దాన్ని చంపి... ఆ మాంసాన్ని చుట్టుపక్కల రెస్టారెంట్లలో అమ్ముతారు. కొన్నాళ్లుగా ఈ తంతు నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు... ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలిసి... ఆపరేషన్ నిర్వహించి... ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేశారు.

నిజామాబాద్‌లో కృష్ట జింకల వేట... హైదరాబాద్‌లో ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

నిజామాబాద్‌లో కృష్ట జింకల వేట... హైదరాబాద్‌లో ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

ఆల్రెడీ ఈ ముగ్గురూ తాజాగా ఓ కృష్ట జింకను చంపి మాంసాన్ని అమ్మారనీ... మరో జింకను వేటాడి పట్టుకెళ్తుండగా తాము పట్టుకన్నామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కలిసి ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. ఇందులో ఐ 20 కారును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే ఒక‌ జింక కాళ్లు, తలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శంకర్ బాబా, మహ్మద్ జుబేర్, మహ్మద్ సల్మానుద్దీన్... ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీపీ వివరించారు. మరో వ్యక్తి ఇమ్రాన్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.


కాపాడిన కృష్ణ జింక వయస్సు మూడేళ్లు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నిందితులపై చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. ఈ చట్టం కింద జింకలను వేటాడే వారికి ఏడేళ్ల జైలు శిక్ష ఉంటుందని హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ క్యూరేటర్ సుభద్రా దేవి తెలిపారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వమని కోరారు.

నిజామాబాద్‌లో కృష్ట జింకల వేట... హైదరాబాద్‌లో ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

అరెస్టైన ముగ్గురిలో ప్రధాన‌ నిందితుడు శంకర్ బాబా ఇదివరకు 10 జింకల్ని చంపాడనీ... కొన్ని బతికున్న జింకల్ని అమ్మాడని... టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. అతనిపై 2018లో కేసు కేసు ఫైల్ అయ్యిందని చెప్పారు.




ఇది కూడా చదవండి: Horoscope Today: మార్చి 10 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి శుభ యోగం

నిజామాబాద్‌లో నీటి వనరులు బాగా ఉండటంతో... ఇప్పుడు అక్కడ జింకలు బాగా పెరుగుతున్నాయి. వాటి సంఖ్య పెరుగుతోంది. వాటిని చూసేందుకు తెలుగు రాష్ట్రాల పర్యాటకులు అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటారు. ఐతే.. ఈ వేటగాళ్ల కళ్లు ఆ జింకలపై పడ్డాయి. వీలు దొరికినప్పుడల్లా వాటిని పట్టుకుపోతున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురూ దొరకడంతో... కొంతవరకూ జింకలు సేఫ్ అనుకోవచ్చు.

First published:

Tags: Hyderabad, Nizamabad

ఉత్తమ కథలు