దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా పోలీసుల మీద ప్రశంసలు కురిశాయి. అయితే, కొందరు మానవహక్కుల కార్యకర్తల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లో ఏడుగురు సభ్యుల బృందం పర్యటించి ఈ ఎన్‌కౌంటర్, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించింది. అయితే, అసలు ఎన్‌కౌంటర్ తర్వాత కొందరు మానవ హక్కుల కార్యకర్తలతో పోలీసులు ఫోన్‌లో మాట్లాడినట్టు, వారు కూడా బయటకు వచ్చి ఎన్‌కౌంటర్‌కు మద్దతు తెలపాలని కోరినట్టు డెక్కన్ క్రానికల్ పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
కొందరు పోలీసులు ఎనిమిది మంది మానవ హక్కుల కార్యకర్తలకు ఫోన్లు చేసి ఎన్‌కౌంటర్‌కు సపోర్ట్‌గా మాట్లాడాలని కోరినట్టు తెలిపింది. పోలీసు శాఖలోని కొందరు సీనియర్ అధికారులు ఏకంగా మానవహక్కు కార్యకర్తలను కలిసినట్టు ఆ పత్రిక పేర్కొంది. ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని మానవహక్కుల కార్యకర్తలు కూడా పోలీసులకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.