భైంసాలో కర్ఫ్యూ.. తెలంగాణలో తొలిసారి..

నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి రేపు ఉదయం 7 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: January 13, 2020, 7:45 PM IST
భైంసాలో కర్ఫ్యూ.. తెలంగాణలో తొలిసారి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి రేపు ఉదయం 7 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. తమ ఆదేశాలు ధిక్కరించి ఎవరు బయట తిరిగినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు 2 బెటాలియన్ల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ సిబ్బందిని నిర్మల్ జిల్లాకు పంపారు. నిన్న రాత్రి భైంసాలో మతపరమైన హింస జరిగిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పట్టణంలో రెండు వర్గాల ప్రజలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిలో నిర్మల్ ఎస్పీ శశిదాహర్ రాజు, డీఎస్పీ నర్సింగ్ రావు, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వేణుగోపాల్ రావు ఉన్నారు.

కాగా, తెలంగాణలో కర్ఫ్యూ విధించడం ఇదే తొలిసారి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించేందుకు ఎలాంటి సందర్భాలు తలెత్తలేదు. ఇదే విషయాన్ని ఈ మధ్యే హోంమంత్రి కూడా స్పష్టం చేశారు. ఆరేళ్లలో తొలిసారి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించారు.

First published: January 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు