అమీన్‌పూర్ రేప్‌ కేసులో సంచలన ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?

ఆమెను సినిమాకు తీసుకెళ్లి అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన సందీప్‌ను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అంతేకాదు బాలిక ఇంటి యజమాని రవి, తల్లిదండ్రులు తప్పుడు వీడియో చిత్రీకరించి మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించారని ఎస్పీ అన్నారు.


Updated: January 24, 2020, 4:25 PM IST
అమీన్‌పూర్ రేప్‌ కేసులో సంచలన ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?
అమీన్‌పూర్ రేప్‌ కేసులో సంచలన ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..?
  • Share this:
సంచలనం రేపిన అమీన్‌పూర్ రేప్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సంచలన ట్విస్ట్‌ని పోలీసులు బయటపెట్టారు. మైనర్ బాలికపై అసలు అత్యాచారమే జరగలేదని.. పోలీసులకు ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసి హత్యాయత్నం చేశారని గురువారం నగర శివారులోని అమీన్‌పూర్‌లో ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసుపై ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలను మీడియాకు వివరించారు.

బాలికపై అసలు అత్యాచారమే జరగలేదని ఎస్పీ స్పష్టం చేశారు. సదరు బాలిక ఇష్టపూర్వకంగానే సందీప్‌ అనే యువకిడితో సినిమాకు వెళ్లిందని.. ఇంట్లో తెలిస్తే తిడతారనే భయంతో డ్రామాలాడిందని తెలిపారు. ఆమెను సినిమాకు తీసుకెళ్లి అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన సందీప్‌ను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అంతేకాదు బాలిక ఇంటి యజమాని రవి, తల్లిదండ్రులు తప్పుడు వీడియో చిత్రీకరించి మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించారని ఎస్పీ అన్నారు. అసత్య ప్రచారం చేసినందుకు వారిపైనా కేసులు పెట్టామని తెలిపారు.First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు