Home /News /crime /

TELANGANA POLICE FOUND A WOMAN DEAD BODY IN NALLAMALA WHO CAME FROM MUMBAI NK

నల్లమలలో మహిళ హత్య... క్షుద్రపూజలు చేశారా?

నల్లమలలో మహిళ హత్య... క్షుద్రపూజలు చేశారా?

నల్లమలలో మహిళ హత్య... క్షుద్రపూజలు చేశారా?

Telangana : దట్టమైన నల్లమల అడవుల్లో జరిగిన ఆ వివాహిత హత్య పోలీసులకు ఎన్నో ప్రశ్నలు మిగిల్చింది. ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎలా చేశారు, చనిపోయినదెవరు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు.

    Telangana Crime News : నాగర్‌కర్నూల్... నల్లమల అడవుల్లో... అక్క మహాదేవి ఆలయం మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్-శ్రీశైలం హైవే రూట్‌లో... వటువర్లపల్లి నుంచీ అక్క మహాదేవి ఆలయానికి వెళ్లేందుకు కాలినడక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో వెళ్తూ భక్తులు ఓ చోట ఆగిపోయారు. ఎందుకంటే అక్కడ వారికి ఓ మహిళ మృతదేహం కనిపించింది. అది చూడగానే షాకయ్యారు. అమ్మో అనుకుంటూ... పోలీసులకు ఫోన్ చేశారు. ఓ మొబైల్ కంపెనీ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో... మరో వ్యక్తి వేరే కంపెనీ సిగ్నల్స్ ఉండటంతో... ఆ కంపెనీ సిమ్ ద్వారా పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పాడు. అలర్టైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చూశారు. శవం దగ్గర ఓ బ్యాగ్ ఉంది. దాన్ని చెక్ చేస్తే... అందులో ఆధార్ కార్డు దొరికింది. దాని ప్రకారం ఆమె పేరు శాంతా రఘువిదియార్ అని తెలిసింది. ఆమె వయసు 50 ఏళ్లు అనీ, ముంబైకి చెందిన వివాహిత అని అర్థమైంది. అసలు ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. పోలీసులు శవం పడివున్న తీరు చూసి... ఆమెపై అత్యాచారం చేసి... గొంతు కోసి చంపి ఉంటారని అనుకున్నారు. ఐతే... అక్కడ పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. ఏంటంటే... శవానికి దగ్గర్లోనే... నిమ్మకాయలు, కుంకుమ, అగరబత్తిలు ఉన్నాయి. అప్పుడు మరో డౌట్ వచ్చింది. క్షుద్రపూజలు చేసి ఆమెను చంపేశారేమో అన్న డౌట్ వచ్చింది.

    అసలు ఆమె ముంబై నుంచీ నల్లమలకు ఎందుకొచ్చింది? ఒక్కత్తే వచ్చిందా తోడు ఇంకెవరైనా వచ్చారా? ఈ దారుణానికి పాల్పడింది ఎవరు? ఎందుకు? క్షుద్రపూజలతోనే చంపారా లేక... రేప్ చేసి చంపారా? ఇలా రకరకాల అనుమానాలు తలెత్తాయి. ఇప్పటికిప్పుడు వాటిని నిర్ధారించే ఛాన్స్ లేకపోవడంతో... ముందు అక్కడి నుంచీ శవాన్ని తరలించడం బెటర్ అనుకున్నారు. మిగతా భక్తులంతా గుమికూడి చూస్తున్న సమయంలో... శవాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించాలని అనుకున్నారు. ఐతే... కొత్త టెక్నాలజీ వచ్చింది. దాని ద్వారా హత్య జరిగిన స్థలంలోనే పోస్ట్‌మార్టం చెయ్యొచ్చు. అందువల్ల అక్కడే పోస్ట్‌మార్టం చేసి... శవానికి కూడా అక్కడే దహన సంస్కారాలు చేస్తామని అధికారులు తెలిపారు.

    పోలీసుల అనుమానం ఏంటంటే... ఎవరి మాటలో నమ్మి ఆమె అడవిలో బయలుదేరింది. ఆ క్రమంలో వాళ్లు ఆమెను మోసం చేసి... క్షుద్రశక్తుల పూజలు చేసి ఆమెను పీక కోసం చంపి ఉంటారేమో అనుకుంటున్నారు. దర్యాప్తులోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ఘటన మాత్రం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు కలిగించింది. ఇది జరిగిన తర్వాత టెంపుల్‌కి ఎవరూ ఒంటరిగా వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Nallamala forest, Telangana News, Telangana updates

    తదుపరి వార్తలు