• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TELANGANA POLICE ARRESTS MAIN ACCUSED IN CHEVELLA DISHA INCIDENT BS

ప్రియుడే హంతకుడు.. చేవెళ్ల దిశ ఘటనలో విస్తుపోయే నిజాలు..

ప్రియుడే హంతకుడు.. చేవెళ్ల దిశ ఘటనలో విస్తుపోయే నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం

దిశ లాంటి ఘటన చోటుచేసుకున్న రంగారెడ్డి జిల్లా తంగడపల్లి కేసు కొలిక్కి వచ్చింది. హత్యకు గురైన మహిళది సిక్కిం రాష్ట్రంగా పోలీసులు గుర్తించారు. ప్రేమికుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు.

  • Share this:
    దిశ లాంటి ఘటన చోటుచేసుకున్న రంగారెడ్డి జిల్లా తంగడపల్లి కేసు కొలిక్కి వచ్చింది. హత్యకు గురైన మహిళది సిక్కిం రాష్ట్రంగా పోలీసులు గుర్తించారు. ప్రేమికుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. మార్చి 17న ఉదయం తంగడపల్లి శివారులో ఉన్న ఓ వంతెన కింద గుర్తు తెలియని యువతి(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మహిళ మిస్సింగ్‌పై సిక్కింలో కేసు కూడా నమోదైంది. అయితే.. సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మృతదేహాన్ని పారేసేందుకు తీసుకొచ్చిన అద్దె కారును పోలీసులు గుర్తించారు. కారును అద్దె తీసుకున్న చోట ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ప్రధాన నిందితుడి (25)ని అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్ ద్వారా మహిళతో పరిచయం పెంచుకొన్నారని, అది వివాహేతర సంబంధానికి దారి తీసిందని పోలీసులు వెల్లడించారు.

    ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన ఓ గొడవ.. హత్యకు దారితీసిందని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన రోజే మృతురాలిని ఇక్కడికి రప్పించాడని.. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్యకు దారి తీసి ఉండొచ్చని.. నిందితుడి బంధువు కూడా హత్యకు సహకరించాడని పోలీసులు నిర్ధారించారు. హత్య చేశాక మృతదేహాన్ని పాడేసేందుకు కారును అద్దెకు తీసుకున్నారని, అర్ధరాత్రి దాటాక తంగడపల్లి వంతెన పై నుంచి తాడు సహాయంతో కిందకి దించారని తెలిపారు. తలను బండరాయితో మోది.. దుస్తులను అక్కడి నుంచి తీసుకెళ్లారని వివరించారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    అగ్ర కథనాలు