కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు, పాల్వంచ రామకృష్ణ ఆత్మహత్య కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో రాఘవ పోలీసులకు దొరికాడు. దమ్మపేట, చింతలపూడి మధ్య రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. విచారణ కోసం రాఘవను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఎ-2గా వనమా రాఘవ ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాఘవను ప్రశ్నిస్తున్నారు. నిజానికి వనమా రాఘవను పోలీసులు అంతకముందే అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ వనమా రాఘవ తమకు దొరకలేదంటూ కొత్తగూడెం పోలీసులు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది.
రాఘవ కోసం ఏడెనిమిది బృందాలుగా ఏర్పడి తెలంగాణ, ఏపీలో గాలిస్తున్నామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు.వనమా రాఘవపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఆధారాలు లభిస్తే రాఘవపై రైడీషీట్ నమోదు చేస్తామని ఏఎస్పీ వెల్లడించారు.నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో వనమా రాఘవేంద్రరావును హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఈ నెల 3వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. ముగ్గురు సంఘటన స్థలంలోనే చనిపోగా రెండు రోజుల చికిత్స అనంతరం సాహిత్య ప్రాణాలు విడిచింది. కాగా, తన ఆత్మహత్యకు వనమా రాఘవ కారణమని వెల్లడించే ఓ సూసైడ్ నోట్ మృతుడి కారులో లభించింది. ఆ తర్వాత ఇందుకు సంబంధించి సెల్ఫీ వీడియో కూడా లభించింది.
వనమా రాఘవను సస్పెండ్ చేస్తున్నట్లు..
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వనమా రాఘవను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్చార్జ్ నూకల నరేష్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని ఈ మేరకు టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.