Home /News /crime /

TELANGANA POLICE ARREST A LADY WHO TOOK AWAY GOLD ORNAMENTS IN AN APARTMENT NK

ఆమె కళ్లు పడితే హాంఫట్... ఇళ్లలోకి వచ్చి నగలు చోరీ...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Medchal Malkajgiri district : ఇళ్లలో బంగారాన్ని దాచుకుంటే సేఫ్‌గా ఉంటుందని అనుకుంటున్నారా... అంత లేదు. ఆమె లాంటి వాళ్లు ఆ వీధిలో ఒక్కరున్నా చాలు... నగలు మాయమే.

  Telangana : మేడ్చల్ జిల్లా... మల్కాజిగిరిలో జరిగిన ఓ ఘటనతో... పోలీసులు కూడా "ఇలాగైతే ఎలా" అనుకునే పరిస్థితి వచ్చింది. అక్కడి ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు అమర్‌బాబు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య ఓ ప్రైవేట్ కాలేజీలో టీచర్. వారికి ఇద్దరు పిల్లలు. వాళ్ల వయసు ఐదేళ్లు, నాలుగేళ్లు. ఫిబ్రవరి 13న సాయంత్రం వేళ ఓ మహిళ ఆ ఫ్లాట్‌కి వచ్చింది. పిల్లలిద్దరూ అప్పుడే స్కూల్ నుంచీ ఇంటికొచ్చి... ఇంట్లో ఉన్నారు. హాయ్ పిల్లలూ... ఎలా ఉన్నారూ... అంటూ నవ్వుతూ లోపలికి వచ్చిన ఆమె... మమ్మీ ఏదీ అని అడిగింది. మమ్మీ ఇంకా రాలేదు అని వాళ్లు చెప్పారు. నేను, మీ మమ్మీ ఇద్దరం ఫ్రెండ్స్ తెలుసా... అంటూ చక్కగా మాట్లాడుతూ... నేను పక్క వీధిలో ఫంక్షన్‌కి వెళ్లేందుకు వచ్చాను. ఈ డ్రెస్ బాలేదు కదా. వేరే డ్రెస్ వేసుకోవడానికి మీ ఇంటికి వచ్చాను. జస్ట్ 5 మినిట్స్ అంటూ తనతో తెచ్చుకున్న శారీతో... బెడ్‌ రూంలోకి వెళ్లి తలుపేసుకుంది. ఆ పిల్లలు... ఆమె నిజంగానే తన తల్లి ఫ్రెండేమో అనుకొని... హోంవర్క్ పనిలో పడ్డారు. కాసేపటికి బెడ్ రూం నుంచీ కొత్త శారీతో బయటకు వచ్చిన ఆమె... పాత శారీని తన బ్యాగులో ఉంచుకొని పిల్లలకు టాటా చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లికి విషయం చెప్పారు. ఆశ్చర్యపోయిన తల్లి... బెడ్ రూంలోకి వెళ్లి చూసింది. అక్కడ చిందరవందరగా ఉంది. బీరువా డోర్లు తెరచివున్నాయి. షాకైన ఆమె లోపలి లాకర్‌లో చూస్తే... బంగారు నగలు, వెండి నగలు కనిపించలేదు. మతి పోయిందామెకు.

  పిల్లల్ని పిలిచి... ఏం జరిగిందని వివరంగా అడిగితే... తమకు తెలిసీ, తెలియని విషయాలు చెప్పారు. భర్త ఇంటికొచ్చాక... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు రాసిన మల్కాజిగిరి పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. ఆమె పాత నేరస్థురాలు రేణుక అని అనుమానించారు. ఆ క్రమంలో ఆమెను గుర్తించి... అరెస్టు చేశారు. అమర్‌బాబు ఇంట్లో ఆమె 32.05 గ్రాముల గోల్డ్ నగలను ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. వాటిలో ఉంగరాలు, దుద్దులు, గోల్డ్ చైన్, లాకెట్‌ వంటివి ఉన్నాయి. వాటి రేటు రూ.1.30లక్షలు. ఆమెను రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

  ఇంతకీ రేణుక ఎవరన్నది మనకు తెలియాలి. మెదక్‌ జిల్లా కేడిపల్లి మండలం తిమ్మాపూర్‌కి చెందిన 26 ఏళ్ల రేణుక... భర్తతో కలిసి కూలిపనులు చేసుకుంటూ జీవించేది. రోజూ కార్లలో వెళ్లేవాళ్లను చూసి... తానూ అలా రిచ్‌గా బతకాలని అనుకుంది. అందుకు సంపాదించే డబ్బు చాలదు కదా... అందుకోసం అడ్డదారి వెతుక్కుంది. చోరీలకు పాల్పడింది. 2018లో నేరేడ్‌మెట్‌, కుషాయిగూడ పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చింది. తాజాగా స్కెచ్ మార్చింది. అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లు నగలతో వెళ్తే చాలు... వాళ్లను ఫాలో అయ్యింది. ఇంటి అడ్రెస్ తెలుసుకుంది. అన్నీ తెలుసుకొని... పెద్దవాళ్లు లేనప్పుడు ఇంట్లోకి వెళ్లి చోరీ చెయ్యాలని ప్లాన్ వేసింది. అలా చేసిందే తాజా చోరీ.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Telangana News, Telangana update

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు