Alert : గూగుల్ ఇచ్చే కస్టమర్ కేర్ నంబర్లతో జాగ్రత్త... పోలీసుల అలర్ట్

Telangana Police Alert : గూగుల్ అన్ని వెబ్‌సైట్లనూ చెక్ చెయ్యదు. అందువల్ల గూగుల్ సెర్చ్‌లో ఇచ్చే ప్రతీ సమాచారమూ కరెక్ట్ అయ్యి ఉండాలన్న రూల్ లేదు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 29, 2019, 11:39 AM IST
Alert : గూగుల్ ఇచ్చే కస్టమర్ కేర్ నంబర్లతో జాగ్రత్త... పోలీసుల అలర్ట్
గూగుల్ ఇచ్చే కస్టమర్ కేర్ నంబర్లతో జాగ్రత్త... పోలీసుల అలర్ట్
Krishna Kumar N | news18-telugu
Updated: September 29, 2019, 11:39 AM IST
Telangana Police Alert : మనందరం ఇంటర్నెట్‌లో ఏది కావాలన్నా ముందుగా గూగుల్‌లో అడిగేస్తాం... వెంటనే ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. వెంటనే దాన్ని ఫాలో అయిపోతాం. గూగుల్ ఇచ్చిన లింక్స్ ఓపెన్ చేసి... వాటిలోకి వెళ్లిపోతాం. ఐతే... ఇక్కడే జాగ్రత్తగా ఉండాలంటున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. గూగుల్‌లో ఏదైనా సర్వీస్ లేదా కస్టమర్ కేర్ నెంబర్ వెతుకుతున్నట్లైతే... కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే మనకు ఎన్నో విషయాలు చెప్పే గూగుల్ సైట్‌లో సైబర్ నేరగాళ్లు పాగా వేసుకొని వున్నారనీ, బీ కేర్ ఫుల్ అని పోలీసులు చెబుతున్నారు. వాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

పోలీసుల సూచనలు :
- సాధారణంగా కస్టమర్ కేర్ నెంబర్ 10 అంకెల ఫోన్ నెంబర్ అయితే... దాన్ని అనుమానించాల్సిందే. ఎందుకంటే... చాలా కస్టమర్ కేర్ నంబర్లు 10 కంటే ఎక్కువ లేదా 10 కంటే తక్కువ ఉంటాయి.

- ఎప్పుడైనా సరే... కస్టమర్ కేర్ నెంబర్‌ను ముందుగా సంబంధిత అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి చూడండి.



- కస్టమర్ కేర్ వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, OTP, CVV నెంబర్ వంటివి చెప్పొద్దు.

- ముఖ్యమైన విషయం. మీరు కాల్ చేసినపుడు కచ్చితంగా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఫోన్లో 1 నొక్కండి లేదా 2 నొక్కండి అని వస్తుంది కదా అలా) వస్తేనే అది కస్టమర్ కేర్ నంబర్ అని నమ్మండి.

ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు పోలీసులు. ఇంత జాగ్రత్త పడినా తేడా వస్తే... వెంటనే తమకు కంప్లైంట్ ఇవ్వమని కోరుతున్నారు పోలీసులు.
First published: September 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...