తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశారు. సర్పంచ్ ఎన్నికల కోసం తొలుత తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని చెప్పిన గ్రామస్తులు, ఆ తర్వాత మరొకరిని పోటీగా రంగంలోకి దించారు. దీంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్ పదవికి అంగిడి రాధ పోటీ చేయాలనుకుంది. ఈ విషయాన్ని గ్రామంలోని పెద్దలు, కుల సంఘాల వారికి తెలియజేసింది. గ్రామంలోని అన్ని కుల సంఘాలు, పెద్దలు సమావేశమై.. అంగిడి రాధను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలను తొలుత నిర్ణయించారు. ఈ మేరకు ఆమెకు హామీ ఇచ్చారు.
హిమ్మత్ నగర్ సర్పంచ్ అభ్యర్థి అంగిడి రాధమ్మ ప్రచార చిత్రం
తాను సర్పంచ్ కావడం ఖాయని రాధ ధీమాగా ఉంది. అయితే, ఆమెకు పోటీగా మరొకరు నామినేషన్ వేశారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని చెప్పిన పెద్దలే మరొకరితో నామినేషన్ వేయించడంతో ఆమె మనస్తాపం చెందింది. దీంతో పాటు ఇన్నాళ్లూ తనకు మద్దతుగా నిలిచిన వారిని కూడా బెదిరిస్తున్నారని ఆమె భావించింది. దీనిపై మనస్తాపం చెందిన రాధ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న రాధను గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.
అంగిడి రాధను టీఆర్ఎస్ పార్టీ బలపరిచింది. అయితే, ఆమెకు పోటీగా బరిలో దిగిన మరో మహిళకు కూడా స్థానికంగా టీఆర్ఎస్ పార్టీనే మద్దతు పలుకుతోంది. తనను కనీసం ప్రచారం కూడా చేయనివ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెందినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికుంటామని హామీ ఇచ్చిన పెద్దలు, ఇప్పుడు నామినేషన్ విత్ డ్రా చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తేవడంతో రాధ పురుగుల మందు తాగింది. నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి 28వ తేదీ ఆఖరు. 30న ఎన్నికలు జరగనున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.