హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: కన్నతండ్రే కాటేశాడు.. మూడు నెలలుగా కూతురిపై అత్యాచారం.. భార్యకు విషయం తెలియడంతో..

Telangana: కన్నతండ్రే కాటేశాడు.. మూడు నెలలుగా కూతురిపై అత్యాచారం.. భార్యకు విషయం తెలియడంతో..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఓ కామాంధుడు కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటున్న 9వ తరగతి చదువుతున్న బాలికపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు.

కూతురిని కంటికి రెప్పలా కాపాల్సిన కన్నతండ్రే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కామాంధుడిగా మారి మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. బాలిక గర్భవతి అని తెలియడంతో ఆ నీచపు తండ్రి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణ నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసివేయడంతో గత కొంతకాలంగా ఆమె ఇంటి వద్దే ఉంటుంది. అయితే ఇంటివద్దే ఉంటున్న బాలికపై ఆమె తండ్రి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని.. చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఇలా పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే ఇటీవల బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో అతడు భార్యతో కలిసి కూతురిని దేవరకొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆమె గర్భం దాల్చినట్టు చెప్పారు. ఇది విన్న బాలిక తల్లి ఒక్కసారిగా షాక్ తింది. ఇందుకు సంబంధించి కూతురిని నిలదీసింది. దీంతో బాలిక తన తల్లికి అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లి భర్తను నిలదీసింది. అయితే భార్య అలా నిలదీయడం జీర్ణించుకోలేకపోయిన అతడు.. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని తల్లీకూతుళ్లపై దాడి చేశాడు. శనివారం రాత్రి ఇంట్లోనే బంధించి చితకబాదాడు.

ఈ బాధలు తట్టుకోలేపోయిన బాలిక.. పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక, దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలకు, దాడులకు పాల్పడుతున్న వారిలో తెలిసినవారే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

First published:

Tags: Crime news, Nalgonda, RAPE, Telangana

ఉత్తమ కథలు