Telangana: అతడిని ఎన్‌కౌంటర్ చేయాలి.. తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana: ఆరేళ్ల పాప అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • Share this:
  ఆరేళ్ల పాప అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే తాను బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని అన్నారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని సినీ హీరో మంచు మనోజ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కాళ్లపై పడి ఆ బిడ్డ తల్లి, ఆవేదన చెందుతుంటే, అచేతనుడినైపోయానని అన్నారు. ఆడపిల్లలను ఎలా గౌరవైంచాలనే విషయం ప్రతీ ఇంటిలో తల్లితండ్రులు, తమ తమ బిడ్డలకు నేర్పాలని అన్ానరు. ఇంకా ఆ దుర్మార్గుడు దొరకలేదని.. పోలీసులు వెతుకుతున్నామని చెబుతున్నారని మనోజ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దుర్మార్గుడిని పట్టుకుని 24గంటల్లో కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. మీడియా, సోషల్ మీడియాల్లో నిందితుడి ఫోటోను షేర్ చేయాలని.. అతడి కోసం ఊరంతా జనాలంతా జల్లెడ పట్టాలని కోరారు.

  మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు రాజు ఇంకా దొరక్కపోవడం ఉత్కంఠకు దారితీస్తుంది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయాలంటూ అనేక మంది డిమాండ్ చేస్తున్నా.. పోలీసులకు మాత్రం అత్యాచార నిందితుడు చుక్కలు చూపిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా పోలీసులు వెతుకున్న సమయంలో సంఘటన అనంతరం నిందితుడు పారిపోయేందుకు అత్యాచారం జరిగిన బస్తీలోనే అతని స్నేహితుడు సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాలు పరీశీలించిన పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. అత్యాచారం జరిగిన తర్వాత పోలీసులు నిందితున్ని వెతుకున్న సందర్భంలోనే.. నిందితున్ని తప్పించేందుకు అతని స్నేహితుడు సహకరించినట్టుగా తెలుస్తోంది.

  ఇందుకోసం నిందితున్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు నెత్తికి టోపి, భుజం రుమాలుతో పాటు మాస్కు, ఓ జత బట్టలతో కూడా ఓ ప్లాస్టిక్ బ్యాగును సైతం ఇచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు.దీంతో సీసీ కెమెరాలను పరశీలించిన పోలీసులు సైతం ఇదే గమనించారు. తన స్నేహితుడితో కలిసి వెళ్లడం కెమెరాల్లో రికార్డు అయింది. పది బృందాలతో నాలుగు రోజులుగా గాలిస్తున్నా.. నిందితుడు రాజు అచూకి మాత్రం లభించడం కష్టంగా మారింది. మరోవైపు నిందితుడు గంజాయి పీల్చడం , గుడుంబా తాగడం లాంటీ వాటితో రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడనే సమాచారాన్ని సేకరించారు.

  Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటున్నారా ?.. ఇలా చేస్తే మీ నిద్రకు ఇబ్బంది ఉండదు..

  Revanth Reddy: రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే.. ఆ రిపోర్ట్ ఆధారంగా కీలక నిర్ణయాలు

  నాలుగు రోజులు క్రితం సైదాబాద్‌ బస్తిలో నివాసం ఉండే ఆరేళ్ల చిన్నారీకి చాక్లెట్ ఆశ చూపి తన గదికి తీసుకువెళ్లిన నిందితుడు దారుణంగా హత్య చేసి తన గదిలోనే తాళం వేసి బయటకు వచ్చాడు. అయితే ఇదే అంశంపై పోలీసులకు చెప్పినా.. పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: