Home /News /crime /

TELANGANA MEDICAL STUDENT HARASSED BY NEIGHBOUR MINOR BOY WITH UNWANTED MESSAGES SRD

Cyber Crime: పక్కింటి పిల్లాడే కదా అని ఫోన్ ఇస్తే.. అక్కా అక్కా అంటూనే పాడుపని..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cyber Crime: ఇంటి పక్కన 9వ తరగతి చదివే ఓ పిల్లాడు ఉన్నాడు. అక్కా అని పిలుస్తూ.. తరచూ ఇంటికి వచ్చేవాడు. చిన్న పిల్లాడే కదా అని అడిగిన ప్రతిసారీ ఫోన్ ఇచ్చేది. అదే ఆమె చేసిన తప్పు అయిపోయింది.

  ఈ రోజుల్లో ఎవర్ని నమ్మకూడదు. గుడ్డిగా నమ్మామంటే ఇక అంతే సంగతులు. ఎప్పుడు కాటేయాలా అని ఆలోచిస్తారు. . అవతలివారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత సమాచారం ఇచ్చి లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. సోషల్ మీడియా మత్తులో పడి ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారు. వివరాల్లోకెళితే.. ఆమె ఓ మెడికల్ విద్యార్థిని. ఆమె ఇంటి పక్కన 9వ తరగతి చదివే ఓ పిల్లాడు ఉన్నాడు. అక్కా అని పిలుస్తూ.. తరచూ ఇంటికి వచ్చేవాడు. చిన్న పిల్లాడే కదా అని అడిగిన ప్రతిసారీ ఫోన్ ఇచ్చేది. అదే ఆమె చేసిన తప్పు అయిపోయింది. ఆ పిల్లాడు.. ఆమె ఫోన్ లో పాస్ వర్డ్ మార్చి.. అక్కడ నుంచి ఆమె పేరుతో ఆన్‌లైన్‌ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అశ్లీలచిత్రాలు పోస్ట్‌చేయడం వంటి చర్యలతో ఆమెను మానసికంగా చిత్రహింసకు గురిచేశాడు.

  ఈ విషయం తెలియని ఆ యువతి.. తన ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయంటూ వాపోయింది. తన ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్‌ అయ్యాయంటూ అతడి దగ్గరే తన గోడు వెళ్లబోసుకునేది. ఆమె అలా బాధపడినప్పుడల్లా అతడు కూడా.. తన అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు అయితే.. చివరకు వేధింపులు తట్టుకోలేక యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

  రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఇతరుల ఫోన్‌లు తీసుకొని వారి మెయిల్స్‌ ఓపెన్‌ చేయడం, పాస్‌వర్డులు మార్చడం, తర్వాత వేరే సిస్టంలో మెయిల్‌ ఓపెన్‌ చేసి అసభ్యకర మెసేజ్‌లు పంపడం తనకు అలవాటు అని చెప్పాడు.

  దీంతో బాలుణ్ని పోలీసులు జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. అయితే.. తనతో స్నేహంగా ఉన్న పక్కింటి బాలుడే ఇలాంటి నీచమైన పనికి పాల్పడ్డాడని తెలియడంతో ఆ యువతి తీవ్ర నిరాశకు గురైంది.ఇలా ఎవర్ని పడితే వాళ్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

  మరో ఘటనలో  పంజాబ్‌లోని హనుమాన్‌గఢ్‌కు చెందిన ఓ మహిళకు 16ఏళ్ల కుమారుడు ఉన్నాడు. చాలా మందిలాగే అతడు కూడా స్మార్ట్ ఫోన్‌కు బానిసైపోయాడు. భారత ప్రభుత్వం పబ్జీని బ్యాన్ చేసినప్పటికీ.. ఇంటర్నేషనల్ వర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తన ఆటను కొనసాగించాడు.

  ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన అంకిత్ (20).. అతడికి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ఆన్‌లైన్‌లో గంటల కొద్దీ పబ్జీ ఆడేవారు. వారిద్దరి మధ్య పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఫోన్‌లు చేసుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ రోజు అంకిత్.. ఆ పదహారేళ్ల కుర్రాడికి ఫోన్ చేశాడు. మెయిల్ ఐడీ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అనంతరం ఆ కుర్రాడి ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా అడిగి తెలుసుకున్నాడు.

  ఈ క్రమంలో అంకిత్ ఆ పదహారేళ్ల కుర్రాడికి తెలియకుండానే.. అతడి ఫోన్‌ను హ్యాక్ చేశాడు. ఆ తర్వాత 16ఏళ్ల కుర్రాడి తల్లికి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫోటోలు, వీడియోలను ఫోన్ నుంచి దొంగిలించాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఆమెకు ఫోన్ చేసి.. ఫోటోలు, వీడియోల గురించి చెప్పి, తాను చెప్పినట్లు చేయకపోతే వాటిని బయటపెడతానని బెదిరించాడు. తరచూ ఫోన్‌ చేస్తూ తనతో మాట్లాడాల్సిందిగా ఆమెను బలవంతం చేశాడు.

  దీంతో విసిగిపోయిన ఆమె.. అంకిత్ ఫోన్‌ను లిఫ్ట్ చేయడం మానేసింది. ఈ క్రమంలో ఆగ్రహానికిలోనైన అంకిత్.. తనకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే.. ఫోటోలు, వీడియోలను బయటపెడతానని ఆమెను బెదిరించాడు. ఆ మాటలను విని భయాందోళనలకు గురైన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల దర్యాప్తులో అస్సలు విషయం తెలిసింది. 
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Blackmail, Crime news, Social Media

  తదుపరి వార్తలు