• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TELANGANA MARRIED WOMAN DIED WITH SHORT CIRCUIT IN MEDAK DISTRICT SU

Telangana: పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు.. పండగ వేళ తీరని విషాదం..

Telangana: పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు.. పండగ వేళ తీరని విషాదం..

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లై మూడు నెలలు కూడా కాకముందే ఓ యువతి జీవితంలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

  • Share this:
    ఆమెకు పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు.. కొత్త ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆమె ఆశలు తీరనేలేదు. కానీ ఇంతలోనే పొరపాటున జరిగిన ప్రమాదం ఆమె ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని ఆదివారం రోజున చోటుచేసుకుంది. అయితే ఆ బాధిత యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మనోహరాబాద్‌ మండలం దండుపల్లికి చెందిన కనిగిరి నర్సింలు రెండో కూతురు శిరీష(20)ను శివ్వంపేట మండలం గంగాయిపల్లికి చెందిన ఒగ్గు దశరథ కుమారుడు ప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ ఏడాది జనవరి 10వ తేదీన వీరి పెళ్లి జరిగింది. అత్తారింట్లో శిరీష జీవితం బాగానే సాగుతుంది.

    అయితే హోలీ పండగ సందర్భంగా ఆదివారం తెల్లవారుజము నుంచే శిరీష ఇంటి పనులను ప్రారంభించింది. ఉత్సాహంగా పనులు చేయసాగింది. ఈ క్రమంలోనే వేడి నీటి కోసం ఓ బకెట్‌లో వాటర్ హీటర్ పెట్టింది. ఆ తర్వాత మరో బకెట్‌లో నీటిని తీసుకుని వచ్చి ఇళ్లును శుభ్రం చేస్తుంది. అయితే శిరీష పొరపాటు హీటర్ ఉంచిన బకెట్‌లో నుంచి నీరును తీసేందుకు మగ్గును ముంచింది. దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. అక్కడే కిందపడిపోయింది.

    ఇది గమనించిన శిరీష కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. శిరీషను మేడ్చల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పారు. ఇక, ఈ ఘటనకు సంబంధఇంచి మృతురాలు శిరీష తండ్రి నర్సింలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై రమేశ్ తెలిపారు. ఇక, యువతి మృతితో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు