బంధువుల పెళ్లిలో పరిచయమైన యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. ఫ్రెండ్స్ సాకారంతో అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జడ్చర్లకు చెందిన 17 ఏళ్ల ఓ యువతి 2020 డిసెంబర్లో హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లింది. ఆ పెళ్లిలో ఆమెకు మలక్‌పేటకు చెందిన సబీల్ అనే వ్యక్తి పరిచమయ్యాడు. దీంతో సబిల్ ఆ యువతి ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే యువతితో చాటింగ్ చేసేవాడు.ఈ క్రమంలోనే జనవరి 2న మరో ఇద్దరు స్నేహితులతో కలిసి జడ్చర్లకు వచ్చాడు. ఈ విషయాన్ని యువతి ఫోన్ చేసి మాయమాటలు చెప్పి కొత్త బస్టాండ్‌కు వచ్చేలా చేశాడు.
తీరా యువతి తాను చెప్పిన చోటుకు వచ్చిన తర్వాత ఆమెను లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ తన ప్లాన్‌ను అమలు చేశాడు. మత్తు మందు కలిపిన నీళ్లను యువతికి అందజేశారు. ఆమె ఆ నీళ్లుతాగి మత్తులో జారుకున్నాక ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఆ తర్వాత వీడియోను బంధువుల ఫోన్లకు పంపాడు. మరోవైపు ఈ వీడియోను అడ్డం పెట్టుకున్న సబీల్ ప్రెండ్స్ కూడా ఆ యువతిని వేధించసాగారు. ఈ క్రమంలోనే యువతి కుటుంబ సభ్యుల ఫోన్లకు కూడా ఈ వీడియోను పంపించారు.
ఈ వీడియో చూసిన బాధితు యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జడ్చర్ల పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం హైదరాబాద్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జడ్చర్లకు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.