Warangal: మేన కోడలు మార్పింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దుండగుడు.. ఆత్మహత్యే శరణ్యమంటున్న బాధితులు

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మేనకోడలితోపాటు, ఆమె ఫ్రెండ్స్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

  • Share this:
    తెలంగాణలోని వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మేనకోడలితోపాటు, ఆమె ఫ్రెండ్స్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వివరాలు.. వరంగల్ జిల్లాలోని కరీమాబాద్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో తన మేనకోడలు కుటుంబంపై ప్రతీకారం తీర్చుకునేందుకు నీచపు ఆలోచనకు పాల్పడ్డాడు. తన మేనకోడలి ఫొటోలను మార్ఫ్ చేసి ఆమెను బ్యాడ్‌గా చిత్రీకరించేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫ్రెండ్స్ ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఇది గమనించిన బాధితులు కొన్ని రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు శంకర్ మరింతగా రెచ్చిపోయాడు. గతంలో పోస్ట్ చేసిన ఫొటోలకు మించి మరింత అసభ్యకరంగా వారి ఫొటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

    శంకర్ చర్యలతో బాధితులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. మార్ఫింగ్ ఫొటోలు అడ్డుపెట్టుకుని శంకర్.. బాధితురాలి పెళ్లి ఆపాలని చూస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ బారి నుంచి తమను కాపాడకపోతే ఆత్మహత్య శరణ్యమని వాపోతున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
    Published by:Sumanth Kanukula
    First published: