ఓ వ్యక్తి పెళ్లైన మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే కొద్ది రోజులకు వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే మహిళ ఇంటికెళ్లిన అతడు ఆమెతో వాదనకు దిగాడు. దీంతో ఆ మహిళ గ్రామ సర్పంచ్‌కు చెప్పేందుకు వారింటికి వెళ్లింది. అయితే అదే సమయంలో అక్కడికి మహిళ భర్త చేరుకోవడంతో పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన నరసింహ బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి అదే గ్రామానికి చెందిన దోసపాటి మంగమ్మతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది.
ఆ తర్వాత నరసింహ, మంగమ్మ మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే శనివారం కూడా మంగమ్మ ఇంటికి వెళ్లిన నరసింమ ఆమెతో వాదనకు దిగాడు. దీంతో మంగమ్మ.. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్‌కు చెప్పేందుకు వారింటికి వెళ్లింది. నరసింహ కూడా అక్కడికి రావడంతో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో బయట పని ముగించుకుని ఇంటికి వస్తున్న మంగమ్మ భర్త వెంకటయ్య.. అక్కడికి చేరుకున్నాడు. దీంతో మంగమ్మ..గొడవ విషయం భర్త వెంకటయ్యకు చెప్పింది.
Hyderabad: వదిన అంటూ దగ్గరయి.. మహిళతో వివాహేతర సంబంధం.. వీరిద్దరు కలిసి ఎంత నీచమైన పని చేశారంటే..
కొత్త రకం దందా.. నలుగురు యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వారు ఏం చేశారంటే..?
దీంతో నరసింహ, వెంకటయ్యల మధ్య మాటమాట పెరిగింది. ఆవేశంలో వెంకటయ్య.. తన చేతిలో ఉన్న గొడ్డలితో నరసింహ తలపై దాడి చేశాడు. తలపై పెద్ద గాయం కావడంతో.. స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. పరిస్థితి విషమించడంతో నరసింహ మృతిచెందాడు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. నరసింహ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Murder, Nalgonda, Telangana