Telangana: వివాహేతర సంబంధం.. మహిళ ఇంట్లో కనిపించిన బస్సు డ్రైవర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మకచిత్రం

భర్తను కోల్పోయి కుమారుడితో కలిసి ఉంటున్న మహిళతో.. ఓ బస్సు డ్రైవర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

  • Share this:
    ఓ వితంతువుతో పరిచయం పెంచుకున్న బస్సు డ్రైవర్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్తను కోల్పోయి కుమారుడితో కలిసి ఉంటున్న ఆమెతో కొంతకాలంగా బంధం కొనసాగిస్తూ వచ్చాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ బంధువులు పట్టపగలే అతనిపై దాడి చేసిన హతమార్చారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గార్లలోని పుట్టకోట బజారుకు చెందిన గొడుగు ధనమ్మ భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె కుమారుడితో కలిసి ఉంటుంది. అయితే ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు(55) కారేపల్లిలోని కవిత ఇంజనీరింగ్‌ కళాశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోజూ గార్ల నుంచి విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్లి.. తిరిగి సాయంత్రం తీసుకువచ్చి గార్లలోనే బస చేసేవాడు.

    ఈ క్రమంలోనే గార్లలో నివాసం ఉంటున్న ధనమ్మతో వెంకటేశ్వర్లుకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు ఇది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఈ విషయం ధనమ్మ కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. ఈ క్రమంలోనే ధనమ్మ తమ్ముడు చాట్ల కోటేష్, ఆమె అక్క కొడుకు గంగరబోయిన సంపత్‌ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ధనమ్మ వివాహేతర సంబంధం కొనసాగించడం వల్ల తమ పరువు పోతుందని భావించారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లును అంతం చేయాలని ప్లాన్ చేశారు.

    Telangana: ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం.. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తారంటే..

    ఈ క్రమంలోనే పథకం ప్రకారం మధ్యాహ్నం ధనమ్మ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వెంకటేశ్వర్లు ధనమ్మ ఇంట్లోనే ఉండటం చూసి మరింత ఆవేశపడ్డారు. వెంకటేశ్వర్లుపై తీవ్ర స్థాయిలో దాడిచేశారు. ఫ్యాన్ స్టాండ్‌తో దాడి చేయడంతో వెంకటేశ్వర్లుపై దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దాడిని అడ్డుకునేందకు ప్రయత్నించిన ధనమ్మకు కూడా గాయాలయ్యాయి. అనంతరం కోటేష్, సంపత్‌లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మహబూబాబాద్ నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. నిందితులు పరారీలో ఉన్నారని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: