హోమ్ /వార్తలు /క్రైమ్ /

భార్యాభర్తల మధ్య గొడవ.. పుట్టింటికి వెళ్లిన భార్య.. ఊరి చివర పొలంలో షాకింగ్ సీన్

భార్యాభర్తల మధ్య గొడవ.. పుట్టింటికి వెళ్లిన భార్య.. ఊరి చివర పొలంలో షాకింగ్ సీన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నాలుగు రోజుల క్రితం గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్య ఇక కాపురానికి రాదని మనస్తాపం చెందిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి అతని భార్య పుట్టింట్లో ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన మామిడి నర్సింగ్(38) కు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సన్నపల్లి శకినాతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం వీరి కాపురం బాగానే సాగింది. అయితే కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో శకినా పుట్టింటికి వెళ్లింది. గొడవతో వెళ్లిన భార్య ఇక కాపురానికి రాదేమోనని మనస్తాపం చెందిన నర్సింగ్ గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

నర్సింగ్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది.. నర్సింగ్ ఊరి చివర తన వ్యవసాయ భూమిలో చెట్టుకు తాడుతో ఉరేసుకుని కనిపించాడు. దీంతో నర్సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక, భర్త మరణవార్త విన్న భార్య పుట్టింట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

మరోవైపు స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నర్సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడి తండ్రి రాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్త చేస్తు న్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి పేర్కొన్నారు. చిన్న చిన్న కారణాలతో భార్య భర్తలు గొడవలు పడి ఆత్మహత్య చేసుకోవడాలు దీనితో పిల్లలు అనాధలుగా మారడం రోజు రోజు కు ఎక్కువ అవుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భార్య భర్తలు కలిపి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన వారిలో మార్పు రావడం లేదని కొందరు పోలీసులు చెబుతున్నారు.

First published:

Tags: Crime news, Karimangar, Suicide, Telangana

ఉత్తమ కథలు