వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని భావించారు. అయితే తొందరపడి వారు తీసుకన్న నిర్ణయం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భావించి.. ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌కు చెందిన హరీష్, నిశిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హరీష్‌కు 20 ఏళ్లు కాగా, నిశిత వయసు 18. ప్రస్తుతం హరీష్ డిగ్రీ చదవుతుండగా.. ఇటీవలే నిశిత ఇంటర్ పూర్తి చేసింది. అయితే ఒకే గ్రామానికి చెందిన వీరి కులాలు వేర్వేరు కావడంతో.. నిశిత ఇంట్లో తమ పెళ్లికి ఒప్పుకోరని హరీష్ భావించాడు. ఈ క్రమంలోనే వారు ఆత్మహత్య చేసుకోవాలనే తొందపరపాటు నిర్ణయం తీసుకున్నారు. తాము కలిసి బతకలేమనే భావనతో.. వారు ఆవేశంలో ప్రాణాలు తీసుకున్నారు.
తాము కలిసి బతకాలని అనుకున్నాం, మేము బతకాలంటే విడిపోవాలి. అందుకే చావాలని ఫిక్స్ అయ్యాం. అందుకే ఇలా చేస్తున్నాం అని హరీష్ తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడు. ఇది చూసిన హరీష్ బంధువులు, ఫ్రెండ్స్ ఆందోళన చెందారు. హరీష్ జాడ కోసం పలుచోట్ల వెతికారు. అయిన ఫలితం లేకుండా పోయింది. చివరకు నిశిత ఇంటికెళ్లగా.. తలుపులు మూసి ఉన్నాయి. అయితే కిటికీలో నుంచి చూస్తే.. హరీష్, నిశిత దూలానికి వేలాడుతూ కనిపించారు. దీంతో వెంటనే వారికి కిందకు దించారు. అయితే అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో పొన్కల్ గ్రామంలో విషాదం నెలకొంది. నిశిత, హరీష్‌లు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం.. ఇద్దరి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మరోవైపు హరీష్ తన వాట్సాప్ స్టేటస్‌లో.. తమ చావుకు తన గర్ల్‌ఫ్రెండ్ అమ్మ, బావలు కారణమని ఆరోపించాడు. వాళ్లిద్దరి వల్లే తాము చనిపోతున్నామని చెప్పుకొచ్చాడు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.