Lawyer Murder Case: న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో ఆడియో టేపు కలకలం..

వామన్ రావు, నాగమణి (File)

వామన్ రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంట శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు. అతడి కాల్ డేటాను అనాలసిస్ చేయగా.. ‘గుడి కూలితే వామనారావు కూలిపోతాడు' అని శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో క్లిప్ కీలకంగా మారింది.

  • Share this:
    తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్ రావు, ఆయన భార్య నాగమణి దంపతుల హత్యకే సుకు సంబంధించిన ఓ ఆడియో టేపు కలకలం సృష్టిస్తోంది. నిందితుడు కుంట శ్రీనివాస్, సుపారీ గ్యాంగ్ తో మాట్లాడిన ఆడియో టేపు బయటకు వచ్చింది. ఇది 2018లో మాట్లాడినట్లు గా గుర్తించిన పోలీసులు.. ఐతే ఆడియో టేపు ఎంతవరకు నిజమొ కాదో అనే విషయం తెలియాల్సి ఉంది. గుంజపడుగులోని కుల దేవత గుడి వివాదమే హత్యకు గల ప్రధాన కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మృతుడు వామన్ రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంట శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు. అతడి కాల్ డేటాను అనాలసిస్ చేయగా.. ‘గుడి కూలితే వామనారావు కూలిపోతాడు' అని శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో క్లిప్ కీలకంగా మారింది.

    గుంజపడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంట శ్రీనివాస్ గతంలో అనేక బెదిరింపు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుంట శ్రీనివాస్ సింగరేణి కార్మిక సమాఖ్యలో పనిచేశాడని వెల్లడించారు. ఇక హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. కుంట శ్రీనివాస్‌ను త్వరితగతిన అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం సీపీ సత్యనారాయణ ఈరోజు సాయంత్రం మీడియా ముందుకు రానున్నారు. ఇక వామనరావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ -1 గా కుంట శ్రీనివాస్ , ఏ -2 గా అక్కపాక కుమార్, ఏ -3 గా వసంతరావును పేర్కొంటూ ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా కుంట శ్రీనివాస్ మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

    హైకోర్టు న్యాయవాది వామన్‌రావు, ఆయన భార్య నాగమణిని దుండగులు ఫిబ్రవరి 17న అతి కిరాతకంగా నరికి చంపారు. వామన్ ‌రావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌కు కారులో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రామగిరి మండలం సమీపంలో వీరి కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. అనంతరం వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం వారిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

    మరోవైపు న్యాయవాది హత్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తముందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వారిని కాపాడేందుకు అవసరమైతే నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తారని బాంబు పేల్చారు. గురువారం ఉదయం పెద్దపల్లిలో పర్యటించిన బండి సంజయ్.. లాయర్ వామన్ రావు కుటుంబ సభ్యులు పరామర్శించారు. హంతకులకు శిక్షపడే వరకు బీజేపీ తరపున పోరాటం చేస్తామని చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బండి సంజయ్. దీని వెనక ఒకరిద్దరు లేరని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రమేయంతో జరిగిన హత్య అని స్పష్టం చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: