తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో ప్రధాన నిందితుడు కుంటా శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆయన్ను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో ప్రధాన నిందితుడు కుంటా శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆయన్ను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులు కాగా వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు. వామనరావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ -1 గా కుంట శ్రీనివాస్ , ఏ -2 గా అక్కపాక కుమార్, ఏ -3 గా వసంతరావును పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఇప్పుడు ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు న్యాయవాది వామన్‌రావు, ఆయన భార్య నాగమణిని ఫిబ్రవరి 17న అతి కిరాతకంగా నరికి చంపారు. వామన్ రావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌కు కారులో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రామగిరి మండలం సమీపంలో వీరి కారును మరో కారులో వచ్చిన వారు అడ్డగించారు. అనంతరం వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
వామన్ రావు, ఆయన భార్య నాగమణి దంపతుల హత్యకే సుకు సంబంధించిన ఓ ఆడియో టేపు కలకలం సృష్టిస్తోంది. నిందితుడు కుంట శ్రీనివాస్, సుపారీ గ్యాంగ్ తో మాట్లాడిన ఆడియో టేపు బయటకు వచ్చింది. ఇది 2018లో మాట్లాడినట్లు గా గుర్తించిన పోలీసులు.. ఐతే ఆడియో టేపు ఎంతవరకు నిజమొ కాదో అనే విషయం తెలియాల్సి ఉంది. గుంజపడుగులోని కుల దేవత గుడి వివాదమే హత్యకు గల ప్రధాన కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మృతుడు వామన్ రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంట శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు. అతడి కాల్ డేటాను అనాలసిస్ చేయగా.. ‘గుడి కూలితే వామనారావు కూలిపోతాడు' అని శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో క్లిప్ కీలకంగా మారింది.
మరోవైపు ఈ హత్యవెనుక ప్రభుత్వం ప్రమేయం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ''ఇది ఒకరిద్దరు చేసింది కాదు. ఒక వ్యవస్థ పథకం ప్రకారం ప్రభుత్వ ప్రేమయంతో చేసిన హత్య. వామన్ రావు అనేక అంశాలపై పిల్, కేసులు వేశారు. ప్రభుత్వ అక్రమాలు, నేతల అవినీతి గురించి ఆయన పోరాడుతున్నాడు. పూర్తి చిట్టా ఆయన వద్ద ఉంది. దాని తెరమరుగు చేయడానికే చంపేశారు. 24 గంటల గడుస్తున్నా ప్రభుత్వం స్పందిచడం లేదు. ప్రాణహామీ ఉందని చెప్పినా ప్రభుత్వం రక్షణ కల్పించలేదు. దీని వెనక ఎంత మంది పెద్దవారు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే నిందితులను ఎన్కౌంటర్ చేస్తారు. దీని వెనక ఉన్న వారిని బయటకు రానీయరు. ప్రభుత్వం తప్పించుకోవడానికి పేరు కోసం ఎన్కౌంటర్ చేసినా చేస్తారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణచేయాలి. ఆయన వేసిన కేసులపై ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విచారణ జరపాలి. లేదంటే హత్యల పరంపర కొనసాగుతుంది. న్యాయవాదులకు రక్షణ ఉండదు.'' అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.