మూడేళ్ల పగ... సికింద్రాబాద్‌లో పరువు హత్య?

ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే పరువు హత్యల్ని మనమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి సంస్కృతి దక్షిణాదిలో లేదని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ, చరిత్రను వక్రీకరించలేం. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు కామనైపోతున్నాయి. నెత్తుటి రాతలతో రక్త చరిత్ర రాస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: December 30, 2018, 6:04 AM IST
మూడేళ్ల పగ... సికింద్రాబాద్‌లో పరువు హత్య?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సికింద్రాబాద్... తిరుమలగిరిలోని టీచర్స్ కాలనీలో అర్థరాత్రి జరిగిందో దారుణం. నందకిషోర్... తన పని ముగించుకొని... ఇంటికి వెళ్తున్నాడు. ఆ టైమ్‌లో అంతా చీకటిగా ఉంది. కానీ తన వెనక ఎవరో వస్తున్నట్లు అతనికి అర్థమైంది. వెనక్కి తిరిగి చూస్తే... కొన్ని నీడలు కనిపించాయి. అవి తన కోసమే వస్తున్నట్లుగా అనిపించాయి. ఒళ్లు జలదరించింది. స్ట్రీట్ లైట్లు కూడా సరిగా వెలగని వీధి అది. తనలాగే ఇళ్లకు వెళ్లేవాళ్లు వస్తున్నారేమో అనుకుంటూ వేగంగా అడుగులు వేయసాగాడు. మరుక్షణంలో... అతని తలపై బలంగా దాడి జరిగింది. అప్పుడర్థమైంది. ఆ నీడలు వెంటాడుతున్నది తననే అని. రెప్పపాటులో విషయాన్ని గ్రహించి... అరక్షణంలో పరుగు అందుకున్నాడు. నీడలు మరింత రెచ్చిపోయాడు. వాటి చేతుల్లో కర్రలు భీకరంగా కదిలాయి. ఆ వీధి దాటి ఎలాగొలా తప్పించుకోవాలని నందకిషోర్ ఆలోచిస్తుంటే... అంతకంటే వేగంగా నీడలు అతన్ని తరుముతూ వచ్చి రౌండప్ చేశాయి. ఒక్కసారిగా దాడి. అరుపులు వినకుండా నోరు నొక్కేసిన ఆ నీడలు... అతన్ని దారుణంగా కొట్టి చంపాయి. ప్రాణం గాల్లో కలిసిందని నిర్ధారించుకున్నాక... వెంటనే పారిపోయాయి. ఇదీ సికింద్రాబాద్‌లో జరిగిన అమానుష హత్య.

honor killing, honour killing, killing, honor, honor killings, honor killing (crime type), honour killings, honour killing in india, honor killing (cause of death), honour, honour killing uk, honour killing case, honor killing victims, honor killing germany, what are honor killing, delhi honour killing, honour killing india, honor killing pakistan, killing?, honor killing love story, honor killing explained, honor killing in america,  murder, the murder of, virar murder, crime documentary, crime, crime patrol, crime patrol satark, crime patrol 2015, crime patrol dial 100, maharashtra, marriage, true events, emma walker, rape, india, drama, hindi tv serial, police, reality, madhuri, village, indian television, detective, sony entertainment television, investigation, rahul, serial, dial 100, serials, setindia, hot scene, tv serial, పరువు హత్య, సికింద్రాబాద్‌లో హత్య, తిరుమలగిరిలో హత్య,
ప్రతీకాత్మక చిత్రం

మూడేళ్లుగా పగ:
ఈ పరువు హత్య వెనక ఓ ప్రేమ కథ ఉంది. నాలుగేళ్ల కిందట నందకిషోర్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. విషయం పెద్దవాళ్లకు తెలిసింది ఆమెది వేరే కులం కావడంతో... రెండువైపులా పెద్దవాళ్లు పరువు - పంతాలకు పోయారు. ఏడాదిపాటూ ఈ గొడవలు సాగాయి. ప్రేమ ముందు ఇవేవీ నిలవలేకపోయాయి. నందకిషోర్ ఆమెను పెళ్లిచేసుకొని... తిరుమలగిరిలో కాపురం పెట్టాడు. కాలం గడిచేకొద్దీ... అంతా సైలెంటైనట్లు కనిపించారు. నందకిషోర్ కూడా తన కాపురం తాను చేసుకుంటూ... తన కుటుంబాన్ని పోషించుకుంటూ బతుకుతున్నాడు. మరి ఎవరు పాత గాయాన్ని రేపారోగానీ... నందకిషోర్‌ని చంపేయాలనే ప్లాన్ మూడేళ్ల తర్వాత అమల్లోకి వచ్చింది. అతన్ని చంపించింది అత్తారింటి తరపు వాళ్లే అనే వాదన వినిపిస్తోంది. పోలీసులు పని మొదలుపెట్టారు. ఎంక్వైరీ చేస్తున్నారు.

honor killing, honour killing, killing, honor, honor killings, honor killing (crime type), honour killings, honour killing in india, honor killing (cause of death), honour, honour killing uk, honour killing case, honor killing victims, honor killing germany, what are honor killing, delhi honour killing, honour killing india, honor killing pakistan, killing?, honor killing love story, honor killing explained, honor killing in america,  murder, the murder of, virar murder, crime documentary, crime, crime patrol, crime patrol satark, crime patrol 2015, crime patrol dial 100, maharashtra, marriage, true events, emma walker, rape, india, drama, hindi tv serial, police, reality, madhuri, village, indian television, detective, sony entertainment television, investigation, rahul, serial, dial 100, serials, setindia, hot scene, tv serial, పరువు హత్య, సికింద్రాబాద్‌లో హత్య, తిరుమలగిరిలో హత్య,
ప్రతీకాత్మక చిత్రం

చంపించింది ఎవరైనా... వాళ్లు సాధించేదేముంది? బంగారం లాంటి జంట జీవితం నాశనమైపోయింది. వాళ్లను వదిలేసుంటే, వాళ్ల బతుకేదో వాళ్లు బతికేవాళ్లు. ఇలా ప్రాణం తీసి శత్రువులు సాధించేదేముంది? జైల్లో ఊచలు లెక్కపెడితే పరువు నిలుస్తుందా? హత్యలతో రాసే రక్త చరిత్ర ప్రతిష్టను కాపాడుతుందా? ఏ మార్పు కోసం ఈ పంతాలు, పట్టింపులో శత్రువులు ఆలోచించాల్సిందే.

ఇవి కూడా చదవండి:

తమిళనాడులో దారుణం... పొరపాటున కాలు తగిలిందని... ప్రాణాలు తీసేశాడు...

‘దొంగ డ్యాన్సర్’... పగలు డ్యాన్స్ షోలు... రాత్రిళ్లు ఇళ్లల్లో చోరీలు...

‘తాగుబోతు ఎలుకలు’... వెయ్యి లీటర్ల మద్యాన్ని తాపీగా తాగేశాయి...

Published by: Krishna Kumar N
First published: December 30, 2018, 6:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading