• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TELANGANA HOME MINISTER MAHMOOD ALI COMMENTS ON PRIYANKA REDDY MURDER CASE CREATES SENSATION BA

షాద్‌నగర్ లైంగిక దాడి ఘటనపై హోంమంత్రి వ్యాఖ్యల దుమారం...

షాద్‌నగర్ లైంగిక దాడి ఘటనపై హోంమంత్రి వ్యాఖ్యల దుమారం...

ఈజిప్ట్‌లో ఉరిశిక్షను అమలు చేస్తారు.

ప్రియాంక రెడ్డి తన సోదరికి ఫోన్ చేసే కంటే పోలీసులకు ఫోన్ చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.

  • Share this:
    వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యాచారం కేసుకు సంబంధించి తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన మహమూద్ అలీ ప్రియాంక రెడ్డి తన సోదరికి ఫోన్ చేసే కంటే పోలీసులకు ఫోన్ చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ‘జరిగిన ఘటన చాలా బాధించింది. నేరాలు అదుపు చేయడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. ఆమె (ప్రియాంక రెడ్డి) దురదృష్టవశాత్తూ చెల్లెలికి ఫోన్ చేసింది. 100 నెంబర్‌కు ఫోన్ చేసి ఉంటే బతికి బయటపడేది’ అని మహమూద్ అలీ అన్నారు. అయితే, అసలు పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ప్రియాంకరెడ్డి బతికి ఉండేదని ఆమె కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ప్రియాంక రెడ్డి గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు సీసీటీవీలు చూస్తూ కాలక్షేపం చేశారని ఆరోపించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు