కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, ఏసీసీ తిరుపతి, కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్ రెడ్డికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు వారికి ఒక్కొక్కరికి ఆరు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు మీద వారు అప్పీలుకు వెళ్లేందుకు అనుమతిస్తూ శిక్ష అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది. పుష్పాంజలి రిసార్ట్‌కు సంబంధించి ఓ కేసులో హైకోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. రిసార్ట్‌లోకి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారు వాటిని బేఖాతర్ చేసి రిసార్ట్‌లోకి వెళ్లారంటూ దాని యజమాని కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారికి శిక్ష విధించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్ ల అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో క్లబ్ లు అన్ని మూతపడ్డాయి. అయితే కోర్టు అనుమతితో రమ్మి అడుకునేందుకు పుష్పాంజలి సంస్థ అనుమతులు తెచ్చుకుంది. అయితే, అనుమతులు ఉన్నా గతేడాది కరీంనగర్ పోలీసు కమీషనర్ భారీ ఎత్తున పోలీసు బలగాలతో దాడులు నిర్వహించారు. రమ్మి అడుతున్న ఎంతో మంది అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఆ కేసులో యాజమాని పై కూడా నిందితుడిగా కేసులో చేర్చడంతో కోర్టులో హజరయ్యి బెయిలు తెచ్చుకున్నాడు. కోర్టు అనుమతితో నిర్వహిస్తున్న క్లబ్ పై పోలీసులు సాధారణ దుస్తుల్లో వచ్చి దాడులు నిర్వహించడంతో పాటు ఆధారాలు దొరకకుండా సిసి కెమెరాలు పని చేయకుండా చేసి హర్డ్ డిస్క్ లను సైతం స్వాధీనం చేసుకున్నారని యాజమాని హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీని పై పోలీసులు అనుమతి లేని జూదం నిర్వహిస్తున్నారని దాడులు చేశామని వివరణ ఇచ్చుకున్నా, ఫిర్యాదుదారు ఇచ్చిన ఆధారాలతో న్యాయస్థానం ఏకీభవించింది. కోర్టు ఇచ్చిన అనుమతులను కాదని నేర శిక్షస్మృతిని (సిఆర్ పిసి) పట్టించుకోకుండా పోలీసులు దాడి ఎలా చేస్తారని వివరణ అడిగారు. దీనికి ఎస్ హెచ్ వో శశిధర్ రెడ్డి కోర్టుకు హజరుకాగా కోర్టు అనుమతి కంటే పోలీసు ఉత్తర్వులు అమలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు రాదా అని ప్రశ్నించి కరీంనగర్ కమీషనరేట్ జరిగిన ఈ విషయం పై సిపి స్వయంగా హజరై వివరణ ఇవ్వాలని గతంలో నోటిసులు జారీ చేసింది. శుక్రవారం వెలువడిన తీర్పు అప్పీలుకు వెళ్లేందుకు అనుమతిస్తూ శిక్ష అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.