టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలంద మీడియా సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌పై ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని రవిప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. మూడు కేసుల్లో రవిప్రకాశ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi prakash