హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చు.. ఎవరితోనైనా లేచిపో.. సొంత వదినే అలా అనడంతో..

Telangana: పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చు.. ఎవరితోనైనా లేచిపో.. సొంత వదినే అలా అనడంతో..

పదేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువతి.. తన అన్న‌తోనే కలిసి ఉంటుంది. అయితే యువతి తమతో ఉండటం ఆమె వదినకు నచ్చలేదు.

పదేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువతి.. తన అన్న‌తోనే కలిసి ఉంటుంది. అయితే యువతి తమతో ఉండటం ఆమె వదినకు నచ్చలేదు.

పదేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువతి.. తన అన్న‌తోనే కలిసి ఉంటుంది. అయితే యువతి తమతో ఉండటం ఆమె వదినకు నచ్చలేదు.

  ఓ యువతిని ఆమె సొంత వదినే వేధింపులకు గురిచేసింది. పెళ్లి చేస్తే తాము డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని సూటిపోటీ మాటలతో వేధించేది. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక క్షోభకు లోనైన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. యువతి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. హర్కపూర్‌కు చెందిన రాథోడ్ అరవింద్ ఎనిమిదేళ్ల క్రితం జగిత్యాల జిల్లా గొర్రెపల్లి గ్రామానికి చెందిన తన మేనత్త జాదవ్‌ సెవంతబాయి కూతురు మంజులను అరవింద్‌ పెళ్లి చేసుకున్నాడు. అరవింద్ తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే చనిపోవడంతో.. చెల్లెలు శ్రీదేవి బాధ్యతలు అతడే చూసుకుంటున్నాడు. శ్రీదేవి కూడా అన్న-వదినలతో పాటే ఉంటుంది.  ప్రస్తుతం ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది.

  అయితే ఉపాధి కోసం 2018లో అరవింద్ దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇంటి వద్ద ఉన్న భార్య పిల్లలకు తోడు కోసం మేనత్త సెవంతబాయిను కూడా హర్కపూర్‌లోనే ఉండమని చెప్పాడు. దీంతో సెవంతబాయి అక్కడే ఉంటుంది. అయితే శ్రీదేవిని తమతో ఉంచుకోవడం మంజుల, సెవంతబాయికి ఇష్టం ఉండేది కాదు. ఈ క్రమంలోనే వారు శ్రీదేవిని మాటలతో వేధించేవారు. శ్రీదేవి పెళ్లి విషయంపై కూడా మంజుల ఫోన్‌లో పలుమార్లు అరవింద్‌తో గొడవ పడింది.

  మరోవైపు రోజురోజుకు శ్రీదేవికి ఇంట్లో వేధింపులు ఎక్కువయ్యాయి. ‘నీకు మేము పెళ్లి చేస్తే ఖర్చు తప్ప ఏ లాభం లేదు.. అందుకే ఎవరితోనైనా లేచిపో’అంటూ శ్రీదేవిని వేధించేవారు. ఈ విషయాలను శ్రీదేవి తన అన్న అరవింద్‌కు చెప్పుకొని బాధపడింది. మరోవైపు ఈ ఏడాది జనవరిలో అరవింద్.. స్వగ్రామానికి వచ్చాడు. తన చెల్లెల్ని వేధించడంపై భార్య, మేనత్తతో వాదనకు దిగాడు. దీంతో మంజుల, సెవంతబాయి వారి ఊరు వెళ్లారు. అక్కడికి వెళ్లిన మంజుల శ్రీదేవిని వేధించడం మానలేదు.

  Chandrababu Naidu: సీతక్కకు ధైర్యం చెప్పిన చంద్రబాబు.. ఆమె గురించి డాక్టర్లతో ఏం చెప్పారంటే..


  తాము విడిపోవడానికి నువ్వే కారణమంటూ శ్రీదేవికి ఫోన్ చేసి దూషించేది. అంతేకాకుండా అసభ్యకర పదజాలంతో మాట్లాడేది. ఈ క్రమంలోనే వేధింపులు భరించలేదని శ్రీదేవి పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన బంధువులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించింది. ఈ విషయం తెలసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అరవింద్‌ ఫిర్యాదు మేరకు మంజుల, సెవంతబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

  First published:

  Tags: Adilabad, Crime news, Suicide, Telangana

  ఉత్తమ కథలు