Telangana: కారుతో ఢీకొట్టి, కత్తితో మెడ కోసి ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య.. అతడితో పరిచయమే కొంపముంచింది..

ప్రతీకాత్మక చిత్రం

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. అతడిని కారుతో ఢీకొట్టి, కత్తితో మెడ కోసి అతి కిరాతకంగా హత్య చేశారు.

  • Share this:
    ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. అతడిని కారుతో ఢీకొట్టి, కత్తితో మెడ కోసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వివరాలు.. నరహరి (40) అనే వ్యక్తి మహబూబ్‌నగర్‌ వైష్ణోదేవి కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడు చిన్నచింతకుంట మండలంలోని ఉంద్యాల ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. ఆయన భార్య అరుణకుమారి హన్వాడ మండలంలోని వేపూర్‌లో జీహెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. ఇక, నరహరికి రాజేంద్రనగర్‌లో నివాసం ఉండే జగదీశ్‌తో కొంతకాలం కిందట పరిచయం ఏర్పడింది. జగదీశ్ స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని మంథని కాగా, అతడు రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు జీవనం సాగిస్తున్నాడు.

    ఇక, జగదీశ్‌కు, నరహరి మధ్య స్నేహం ఏర్పడటంతో.. నరహరి కోటి రూపాయల వరకు జగదీశ్‌కు ఇచ్చారు. అయితే రోజులు గడస్తున్న జగదీశ్ డబ్బులు ఇవ్వకపోవడంతో నరహరి అతడిపై ఒత్తడి తెచ్చాడు. దీంతో నరహరి బుధవారం సాయంత్రం జగదీశ్ ఇంటికి వెళ్లారు. అక్కడ వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే వేరే చోట భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పడంతో నరహరి ఇంటికి బయలుదేరాడు. దీంతో నరహరి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు.

    ఇక, బైక్‌పై ఇంటికి వెళ్తున్న నరహరిని భగీరథ కాలనీ సమీపంలో ఓ కారు ఢీకొట్టింది. ఆ తర్వాత కారులోని వ్యక్తులు పదునైన ఆయుధంతో కోశాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే కాసేపటికి అటుగా వెళ్తున్న వారు రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తొలుత అది రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ.. గొంతుపై గాయాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నరహరి బైక్‌ను ఢీకొట్టిన కారు నెంబర్ గురించి ఆరా తీయగా అది జగదీశ్‌ది అని తేలింది. నరహరి భార్య అరుణకుమారి సైతం జగదీశే తన భర్తను హత్య చేశాడని ఆరోపించారు. నరహరి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగదీశ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published: