Home /News /crime /

TELANGANA GANG RAPE CASE THREE YOUTH GANG RAPED A MINOR GIRL WITH FACEBOOK LOVE TRAP IN TELANGANA NK KMM

Facebook Love: ప్రేమ పేరుతో వల. యువతిపై గ్యాంగ్ రేప్

Facebook Love: ప్రేమ పేరుతో వల. యువతిపై గ్యాంగ్ రేప్ (ప్రతీకాత్మక చిత్రం)

Facebook Love: ప్రేమ పేరుతో వల. యువతిపై గ్యాంగ్ రేప్ (ప్రతీకాత్మక చిత్రం)

Gang Rape Case: ఫేస్‌బుక్‌లో కనిపించేదంతా నిజం కాదు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. అయినా సరే... చాలా మంది అవతలి వాళ్లను బాగా నమ్మి మోసపోతున్నారు. ఈ కేసులో ఏమైందో తెలుసుకుందాం.

    Gang Rape in Telangana: ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారి ఆనక యువతిపై సామూహిక అత్యాచారానికి దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మహబూబాబాద్‌ జిల్లా... నరసింహులుపేటకు చెందిన ఓ మైనర్‌ బాలికకు... ఆంధ్రప్రదేశ్ (AP)లోని జంగారెడ్డిగూడెంకి చెందిన సింహాద్రి మురారి అనే యువకుడితో ఫేస్‌బుక్‌ పరిచయం ఏర్పడింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న యువతిపై అతను ప్రేమ పేరుతో వల పన్నాడు. కొన్ని నెలల పాటు ఫేస్ బుక్ చాటింగ్ జరిగాక... "ఎప్పుడూ ఫొటోలు, వీడియో కాల్స్‌లో మాట్లాడుకోవడమేనా... మనం కలుసుకోలేమా" అంటూ ఆ యువకుడు... "నిన్ను డైరెక్టుగా చూడాలి... కలవాలని ఉంది" అని ప్రపోజల్‌ పెట్టాడు. మొదట ఆమె వద్దని అన్నా ప్రేమ మైకంలో ఓ రోజు ధైర్యం చేసి బయలుదేరింది. బస్సులో వచ్చిన ఆ యువతిని అతను రిసీవ్‌ చేసుకున్నాడు. రోజంతా బైక్‌‌పై చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగారు. సాయంత్రానికి ఆమె తిరిగెళ్తానంటూ పట్టుపట్టినా ఒక్కరోజు తనతో ఉండాలని బలవంతపెట్టడాడు. కాదనలేకపోయింది. ముందు ఫ్రెండ్స్‌ ఇంటికి తీసుకెళ్దామని భావించినా... పేరెంట్స్‌కి తెలుస్తుందేమోనని భయపడ్డారు. స్థానికంగా ఉండే ఓ లాడ్డిలో రూం తీసుకున్నారు. మైనర్‌‌ యువతికి రూం ఇవ్వకూడదని రూల్ ఉన్నా... లాడ్జి ఓనర్ కొడుకుతో ఉన్న స్నేహం వల్ల అవేవీ పట్టించుకోలేదు.

    మూడు రోజుల పాటు ఆమెను లాడ్జిలోనే ఉంచిన యువకుడు... మధ్యలో తన ఫ్రెండ్స్‌ అంటూ ఇద్దరిని పరిచయం చేశాడు. వారిద్దరూ కూడా ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తనను పంపించేయండంటూ ఆమె బతిమలాడినా పట్టించుకోకుండా 3 రోజుల పాటు లాడ్జిలోనే బంధించి కామ క్రీడలాడారు. ఆమె ఫోన్‌ను లాక్కున్నారు. తమకు ఎదురు తిరిగితే చంపుతామని బెదిరించారు. నాలుగో రోజు ఎలాగొలా తప్పించుకుంది. జరిగిన విషయాన్ని పేరెంట్స్‌కి చెప్పి ఏడ్చేసింది. అప్పటివరకూ తమ కూతురి కోసం వెతుకుతున్న వారు... ఆమెను ఓదార్చారు. అప్పటికే ఆమె కోసం తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది.

    లాడ్జిలో నిబంధనలు బేఖాతర్‌:
    నిందితులు ఆ యువతిని ఈ నెల 17, 18, 19వ తేదీల్లో లాడ్జిలో ఉంచారు. నిజానికి మైనర్‌‌కు రూం ఇవ్వాల్సి వచ్చినపుడు... ఆమె పక్కన తల్లిదండ్రులు లేనట్లయితే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. డైలీ రిజిస్టరులో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. చిరునామా సహా ఆధార్‌ కార్డు, ఫోన్‌ నెంబర్లు తప్పనిసరిగా రాసుకోవాలి. కానీ ఇక్కడ అవేవీ పాటించలేదు. ఎప్పుడైతే ఈ దారుణం వెలుగుచూసిందో వెంటనే కొత్త రిజిస్టరు పెట్టారు. ఇలా రిజిస్టరు మార్చినపుడు తప్పనిసరిగా స్థానిక పోలీసు అధికారి ధృవీకరించాలన్నది నిబంధన. అయితే ఇక్కడ మాత్రం 20వ తేదీ నుంచి కొత్త రిజిస్టరు పెట్టినట్టు గుర్తించారు. పాత రిజిస్టరు ఎక్కడన్న ప్రశ్నకు కనిపించడం లేదన్న సమాధానంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లాడ్జి ఓనర్‌ కొడుకు ప్రమేయంతోనే రిజిస్టరు మాయం అయినట్టు అనుమానిస్తున్నారు.

    సీసీ ఫుటేజి మాయం:
    హోటళ్లు, లాడ్జిల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి. వ్యక్తుల ప్రవేటు గదుల మినహా రిసెప్షన్‌, కారిడార్లు, పార్కింగ్‌, మొత్తంగా ఇన్‌ అండ్‌ అవుట్‌కు సబంధించి సీసీ కెమెరా సర్వేలెన్స్‌ తప్పనిసరి. కానీ ఘటన జరిగిన మూడు రోజుల సీసీ ఫుటేజీపై పోలీసులు ఆరా తీయగా పనిచేయడం లేదన్న సమాధానం రావడంతో.. యువతిపై అత్యాచారం విషయంలో అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. లాడ్జి ఓనర్‌ ప్రత్యక్ష హస్తం ఉందా.. లేక డబ్బుకు ప్రలోభపడి సాక్ష్యాలైన డైలీ రిజిస్టరు, సీసీ ఫుటేజిని మాయం చేశారా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసుల తీరును మహిళా సంఘాలు, దళిత సంఘాలు ఎండగడుతున్నాయి. అత్యాచారం కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఇది మైనర్ యువతికి సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు గోప్యంగా విచారిస్తున్నట్టు చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి: Rape Case: హైదరాబాద్‌లో అరాచకం... మహిళపై రేప్, హత్యాయత్నం... అత్యంత పాశవికంగా

    నిందితుడు మురారిపై పోక్సో చట్టం ప్రకారం కేసు రాశారు. బాధితురాలిని వరంగల్ లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు.

    (న్యూస్‌18 తెలుగు కరస్పాండెంట్‌ - జి.శ్రీనివాసరెడ్డి)
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Gang rape, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు