తెలంగాణ ఎన్నికలు 2018: సెలవు ఇవ్వలేదని... చేతులు కోసుకున్న విద్యార్థులు...

పోలింగ్ రోజు కూడా క్లాసుల నిర్వహణ... బ్లేడులతో చేతులు కోసుకుని సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసిన విద్యార్థులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 7, 2018, 5:07 PM IST
తెలంగాణ ఎన్నికలు 2018: సెలవు ఇవ్వలేదని... చేతులు కోసుకున్న విద్యార్థులు...
ఓటు వేసేందుకు క్యూలో నిల్చొన్న ప్రజలు (ఫైల్ ఫొటో)
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా... ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కాలేజీలు, స్కూళ్లు, కార్యాలయాలను సెలవు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రవైటు కాలేజీ మాత్రం ఓటింగ్ రోజు కూడా కాలేజ్ తెరిచింది. క్లాస్‌లకు రావాల్సిందేనంటూ విద్యార్థులకు అల్టీమేటం జారీ చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక... మొక్కుతూ, ములుగుతూ క్లాస్‌లకు హాజరైన విద్యార్థులు చేతులు కోసుకుని నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది.

ఎల్బీనగర్ ఏరియాలో ఉంటున్న ఓ కార్పొరేట్ కాలేజీ... ఓటింగ్ రోజు కూడా క్లాస్‌లకు రావాలని విద్యార్థులకు తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియక క్లాస్‌లకు వచ్చిన విద్యార్థుల్లో కొందరు... తమ నిరసనను వ్యక్తం చేసేందుకు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకున్నారు. బ్లేడుతో చేతులు కోసుకున్న ఫోటోలను పోస్ట్ చేసిన విద్యార్థులు... ‘ఈ రోజు తెలంగాణలో పోలింగ్... అన్ని కాలేజీలకు, స్కూళ్లకు సెలవులు ఇచ్చినా మాకు మాత్రం క్లాసులు తీసుకుంటున్నారు. ఇంటికి వెళ్లనివ్వకుండా కాలేజీలోనే ఉంచేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే కాదు... దసరా, దీపావళి పండగలకు కూడా మాకు సెలవులు ఇవ్వలేదు...’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. నిబంధనలకు వ్యతిరేకంగా క్లాసులు నడిపిస్తున్న సదరు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాన్ని నిలదీసిన పోలీసులు... వారిని ఇంటికి పంపించాలని కోరారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు రానిదే... పిల్లలను పంపించలేమని చెప్పి పోలీసులకే ఝలక్ ఇచ్చారు కాలేజీ నిర్వహకులు.

First published: December 7, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading