• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • TELANGANA CRIME WOMAN RAPED AND MURDERED IN CHEVELLA BS

తెలంగాణలో మరో దిశ ఘటన.. యువతిపై అత్యాచారం, హత్య..

తెలంగాణలో మరో దిశ ఘటన.. యువతిపై అత్యాచారం, హత్య..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. దిశ ఘటనను తలపించేలా.. యువతిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఈ దారుణం జరిగింది.

 • Share this:
  తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. దిశ ఘటనను తలపించేలా.. యువతిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఈ దారుణం జరిగింది. మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడం, తలపై బండరాయితో మోది ఉండటం.. అచ్చంగా దిశ ఘటనను తలపించింది. వివరాల్లోకెళితే.. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులో ఉన్న ఓ వంతెన కింద గుర్తు తెలియని యువతి(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆధారాల కోసం స్థానిక సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

  మృతిచెందిన యువతికి సంబంధించిన దుస్తులను ఘటనాస్థలిలో కనుగొన్నారు. అయితే, హత్యకు గురైన యువతి ఏ ప్రాంతానికి చెందినదో తెలియడం లేదని పోలీసులు తెలిపారు. ఆమె సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తాము అనుమానిస్తున్నట్లు తెలిపారు. మిస్సింగ్ కేసులేమైనా ఉన్నాయా అని ఆరా తీసున్నామని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు