TELANGANA COP KILLS FEMALE COLLEAGUE OVER AFFAIR MS
కానిస్టేబుల్స్ మధ్య ఆ సంబంధం.. 'పెళ్లి' చేసుకోమనడంతో దారుణం..
ప్రతీకాత్మక చిత్రం
తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఇటీవల మందారిక ప్రకాశ్‌పై ఒత్తిడి తీసుకురావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమెను అంతం చేయాలని భావించిన ప్రకాశ్.. సోమవారం రాత్రి తన కారులో ఆమెను బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ప్రకాశ్ అనే ఓ పోలీస్ కానిస్టేబుల్ తన సహోద్యోగి అయిన మహిళా కానిస్టేబుల్ మందారికను హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్‌తో కాల్చేశాడు. వెంకటాపురం గ్రామ సమీపంలో మొదట ఆమె గొంతు నులిమి హత్య చేసిన ప్రకాశ్.. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
మందారిక తండ్రి సదానందం.. తమ కుమార్తె విధుల నుంచి ఇంకా ఇంటికి తిరిగిరాలేదని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. వివాహితుడైన ప్రకాశ్‌కు సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో మందారికతో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ వేరేచోట్లకు బదిలీ అయినప్పటికీ.. ఇద్దరి మధ్య సంబంధం కొనసాగుతూ వచ్చింది.
తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఇటీవల మందారిక ప్రకాశ్‌పై ఒత్తిడి తీసుకురావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమెను అంతం చేయాలని భావించిన ప్రకాశ్.. సోమవారం రాత్రి తన కారులో ఆమెను బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుంచి పరారయ్యాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.