హోమ్ /వార్తలు /క్రైమ్ /

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కరెంట్ షాక్.. ఎమ్మెల్యే దంపతులకు తప్పిన ప్రమాదం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కరెంట్ షాక్.. ఎమ్మెల్యే దంపతులకు తప్పిన ప్రమాదం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(ఫైల్ ఫోటో)

నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ మంచి పట్టుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం వారి హవా కనిపించలేదు. ఉమ్మడి జిల్లాలోనూ వారి ప్రభావం అంతగా కనిపించలేదు. అన్న వెంకట్ రెడ్డి నల్గొండలో ఓడిపోగా.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో విజయాన్ని అందుకున్నారు. ఉనికి నిలబెట్టుకున్నారు.

ఇంకా చదవండి ...

    నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ మంచి పట్టుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం వారి హవా కనిపించలేదు. ఉమ్మడి జిల్లాలోనూ వారి ప్రభావం అంతగా కనిపించలేదు. అన్న వెంకట్ రెడ్డి నల్గొండలో ఓడిపోగా.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో విజయాన్ని అందుకున్నారు. ఉనికి నిలబెట్టుకున్నారు. అయితే, తాజాగా రాజగోపాల్ రెడ్డికి పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ అఘాతం నుంచి ఓ వ్యక్తిని కాపాడబోయి ఆయన ప్రమాదంలో చిక్కుకున్నారు. శాలిగౌరారం మండలం చిత్తలూరులోని శ్రీ శాంభవి శంభులింగేశ్వరి ఆలయంలో జరిగిన కల్యాణోత్సవానికి హాజరైన రాజగోపాల్ రెడ్డి దంపతులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. కల్యాణ్ వేదికపైకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి దంపతులకు సన్మానం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ వేడుకలో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన కరెంటు తీగ ఓ భక్తురాలిపై పడింది. దీంతో ఆమె గిలాగిలా కొట్టుకుంటుండగా.. అది గమనించిన రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి .. ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో ఆమెకూడా కరెంటు షాక్ కొట్టడంతో కిందపడిపోయారు. భార్యను కాపాడే ప్రయత్నం చేసిన రాజగోపాల్ రెడ్డి సైతం విద్యుత్ అఘాతానికి గురయ్యారు. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.


    వెంటనే ఆలయమంతా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద గండం తప్పింది. ముగ్గురూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అంతా బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని.. ఈ సందర్భంగా భక్తులకు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    First published:

    Tags: Komatireddy venkat reddy, Nalgonda, Telangana, Telangana News

    ఉత్తమ కథలు