షాద్‌నగర్ నిర్భయ ఘటనపై తొలిసారి స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..

‘అది అత్యంత దారుణమైన, అమానుషమైన దుర్ఘటన. రాత్రి సమయంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దు.’ అని కేసీఆర్ అన్నారు.

news18-telugu
Updated: December 1, 2019, 6:08 PM IST
షాద్‌నగర్ నిర్భయ ఘటనపై తొలిసారి స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
షాద్‌నగర్‌ నిర్భయ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాన ఆర్టీసీ కార్మికులతో ప్రగతిభవన్‌లో ఆత్మీయ సమావేశం సందర్భంగా కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడారు. ‘అది అత్యంత దారుణమైన, అమానుషమైన దుర్ఘటన. రాత్రి సమయంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేయవద్దు. మాన మృగాలు మనమధ్యే తిరుగుతున్నాయి.’ అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. షాద్‌నగర్ హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. ఇటీవల వరంగల్ లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. షాద్‌నగర్ నిర్భయ కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. మరోవైపు మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు చేసే వారు దోషులుగా తేలిన తర్వాత వెంటనే వారికి ఉరిశిక్ష విధించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>