news18-telugu
Updated: November 6, 2020, 11:17 AM IST
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట నవంబర్ 1వ తేదీన ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఆ పార్టీ కార్యకర్త శ్రీనివాస్ మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచాడు. వివరాలు.. బీజేపీ కార్యకర్త అయిన శ్రీనివాస్‌ది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెం. శ్రీనివాస్ ఆదివారం రోజున నాంపల్లిలోని బీజేపీ ఆఫీసుకు వచ్చాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ పార్టీ ఆఫీసు ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ‘అన్నా.. బండి సంజయ్ అంటే నాకు ప్రాణం. నా గుండె కోసిస్తా. పార్టీ కోసం ప్రాణమిస్తా’అంటూ శ్రీనివాస్ చేసిన కామెంట్స్‌ను పలు టీవీ చానల్స్ ప్రసారం చేశాయి.
శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు, స్థానికులు అతన్ని తొలుత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అతన్ని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను బండి సంజయ్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు పరామర్శించారు. అయితే శరీరంపై 60 శాతంకు పైగా కాలిన గాయాలతో బాధపడుతున్న శ్రీనివాస్ కోలుకోవడం కష్టమైంది. కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న శ్రీనివాస్ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
ఇక, శ్రీనివాస్‌కు తల్లి సత్తమ్మ, తండ్రి ఐలయ్య, అన్న శ్రీశైలం ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన శ్రీనివాస్..ప్రస్తుతం నగరంలో కేబుల్ ఆపరరేటర్గా పనిచేస్తున్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 6, 2020, 7:23 AM IST