దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏసీపీ సురేందర్ ఫిర్యాదు

మరోవైపు NHRC దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని ఇవాళ పరిశీలించనుంది.

news18-telugu
Updated: December 7, 2019, 9:27 AM IST
దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏసీపీ సురేందర్ ఫిర్యాదు
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ ఘటనా స్థలం
  • Share this:
దిశా  నిందితుల ఎన్‌కౌంటర్‌పై షాద్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఏసీపీ సురేందర్ ఎన్‌కౌంటర్‌పై ఫిర్యాదు చేశారు. దిశా హత్య కేసు విచారణ అధికారిగా ఉన్న సురేందర్ కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు NHRC దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని ఇవాళ పరిశీలించనుంది. పోలీసుల కస్టడీలో ఉన్నవారు చనిపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని NHRC ఆరోపిస్తోంది.  మరోవైపు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో కూడా పిల్ దాఖలైంది.

ఇక హైకోర్టు కూడా ఇప్పటికే దిశ నిందితుల అంత్యక్రియలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 9 వరకు నలుగురి మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుల ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ కొన్ని మహిళా సంఘాలు హైకోర్టుకు లేఖ రాశాయి. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై స్పందించిన హైకోర్టు ఈనెల 9 వరకు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశించింది. కేసును 9వ తేదీన విచారణ జరపనున్నట్టు తెలిసింది.

దీంతో ఇక నిందితుల మృతదేహాలు కుటుంబసభ్యులకు అందించలేదు. ఇంకా మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలోనే నిందితుల మృతదేహాలు ఉన్నాయి. ఇవాళ సాయంత్రంలోగా జిల్లా జడ్జిద్వారా హైకోర్టుకు నిందితుల పోస్టుమార్టమ్ వీడియో అందించనున్నారు.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>