Home /News /crime /

TELANGANA ACB OFFICIALS CATCHES SUB INSPECTOR WHILE TAKING BRIBE IN SURYAPET NS

Telangana Police: ఆ పని చేస్తూ అడ్డంగా ‘తోట’లో దొరికిన ఎస్ఐ.. ఎలా చిక్కాడంటే?

ఏసీబీకి చిక్కిన ఎస్ఐ లవ కుమార్

ఏసీబీకి చిక్కిన ఎస్ఐ లవ కుమార్

తెలంగాణ ఏసీబీ అధికారులు ఓ ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    విధి నిర్వహణలో అడ్డదారులు తొక్కుతూ అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్న పోలీసు అధికారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఓ పోలీస్ అధికారి అవినీతి నిరోధక శాఖ(ACB)కు అడ్డంగా దొరికిపోయాడు. ఓ హోటల్ నిర్వాహకులను బెదిరించి వారి నుంచి ఏకంగా రూ.1.30 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లవ కుమార్ స్థానిక రాజుగారితోట హోటల్ నిర్వాహకులను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. నిబంధనలు పాటించడం లేదంటూ ఇబ్బందులు పెడుతున్నారు. తన వేధింపులు తప్పాలంటే భారీగా లంచం ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అన్ని అనుమతులు సరిగా ఉన్నా.. నిబంధనలు పాటిస్తున్నా.. తమను ఇబ్బందులు పెడుతున్న ఎస్ఐకి బుద్ధిచెప్పాలంటూ భావించిన యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది.

    దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐని పట్టుకునేందుకు వల పన్నారు. రూ.1.30 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే.. ఆ సదరు ఎస్ఐ శుక్రవారం రిలీవ్ అయ్యి.. హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే.. పోతూ.. పోతూ.. భారీగా డబ్బులు పట్టుకుని వెళ్దామనుకున్న ఈ ఎస్ఐ ఏసీబీ అధికారులకు చిక్కడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: ACB, Telangana Police

    తదుపరి వార్తలు