Telangana: అప్పటికే మూడు పెళ్లిళ్లు.. కోళ్ల ఫారంలో పనిచేసే బాలిక మెడలో మూడు ముళ్లు.. ఆ తర్వాత మరికొందరి సాయంతో..

ప్రతీకాత్మక చిత్రం

మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పిన ఓ వ్యక్తి ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

 • Share this:
  కోళ్ల ఫారంలో పనిచేస్తున్న ఓ బాలికను కిడ్నాప్ చేసిన దుండగుడు.. అత్యాచారానికి పాల్పడ్డారు. అతనికి మరో నలుగురు వ్యక్తులు సహకరించారు. ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మహబూబ్ నగర్‌ జిల్లాలోని భూత్పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సద్దల గుండు ప్రాంతానికి చెందిన ఎండి సాజిత్ మొదట రెండు వివాహాలు చేసుకున్నాడు. ఇద్దరు భార్యల మధ్య గొడవలు జరుగుతుండడంతో వారిని వదిలేసి మూడో వివాహం చేసుకున్నాడు. జిల్లా పరిధిలోగల దేవరకద్ర మండలంలోని కోళ్ల ఫారం లో మూడో భార్యతో కలిసి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అక్కడే కూలి పని చేస్తున్నా దంపతుల కుమార్తె 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి.. ఈ నెల 12వ తేదీ సాయంత్రం బయటకు తీసుకెళ్లాడు. ఇందుకు తన మిత్రుడైన కాజా భాష సాయం తీసుకున్నాడు.

  ఆటోలో బాలికను మన్యంకొండ దేవస్థానం వద్దకు తీసుకొచ్చి ఆలయం ఆవరణలో తాళి కట్టాడు. అక్కడినుంచి ఆటోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి సమీపంలో ఉన్న కోళ్ల ఫారం వద్దకు వెళ్లాడు. అక్కడ సాజిత్‌కు పరిచయమున్న ఖాదర్ వారికి రాత్రి ఆశ్రయం కల్పించాడు. భోజనంతో పాటు వసతి ఏర్పాటు చేశాడు. ఆ మరుసటి రోజు సాజిత్.. తనకు పరిచయం ఉన్న పిచ్చి అంజి సహకారంతో నవాబుపేట లోని ఫంక్షన్ హాల్ కు మకాం మార్చాడు. అక్కడే గదిలో బాలికపై అత్యాచారం మొదలుపెట్టాడు.

  మరోవైపు బాలిక కనిపించకపోవడంతో ఈ నెల 16న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సాజిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జిల్లా జైలుకు రిమాండ్‌కు తరలించారు.
  Published by:Sumanth Kanukula
  First published: