TELANAGANA HOME MINISTER MAHAMOOD ALI QUESTIONED BY COMMON MAN MK
షాద్నగర్ లైంగికదాడి సెగ.. తెలంగాణ హోం మంత్రిని నిలదీసిన సామాన్యుడు...
ప్రియాంక రెడ్డి హత్యాచారం సెగ...తెలంగాణ హోం మంత్రిని నిలదీసిన సామాన్యుడు...
నిందితులను కఠినంగా శిక్షించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులను సైతం సామాన్యులు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది.
డాక్టర్ ప్రియాంక రెడ్డిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా నిందితులను కఠినంగా శిక్షించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులను సైతం సామాన్యులు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. తాజాగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ తన వాహనం ఎక్కుతూ, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు కనబడేలా...ఓ సామాన్యుడు ప్లకార్డులు పట్టుకొని కనిపించాడు. అందులో వెంటనే హత్యాచారం చేసిన వారిని ఉరి తీయాలంటూ ప్రదర్శించాడు. ఈ ఘటనపై స్పందించిన మహమూద్ అలీ ప్రియాంక రెడ్డి తన సోదరికి ఫోన్ చేసే కంటే పోలీసులకు ఫోన్ చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ‘జరిగిన ఘటన చాలా బాధించింది. నేరాలు అదుపు చేయడానికి పోలీసులు శ్రమిస్తున్నారని హోంమంత్రి తెలిపారు.
ఆమె (ప్రియాంక రెడ్డి) దురదృష్టవశాత్తూ చెల్లెలికి ఫోన్ చేసింది. 100 నెంబర్కు ఫోన్ చేసి ఉంటే బతికి బయటపడేది’ అని మహమూద్ అలీ అన్నారు. అయితే, అసలు పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ప్రియాంకరెడ్డి బతికి ఉండేదని ఆమె కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ప్రియాంక రెడ్డి గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు సీసీటీవీలు చూస్తూ కాలక్షేపం చేశారని ఆరోపించారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.