దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ట్విస్ట్... ప్రభుత్వం ఊహించని నిర్ణయం...

ఈనెల 6న జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ మీద తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ దీనికి నేతృత్వం వహించనున్నారు.

news18-telugu
Updated: December 9, 2019, 5:07 AM IST
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ట్విస్ట్... ప్రభుత్వం ఊహించని నిర్ణయం...
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు
  • Share this:
ఈనెల 6న జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ మీద తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. తెలంగాణలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జాతీయ మానవహక్కుల కమిషన్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులలో సిట్ ఏర్పాటైంది. ఇందులో వనపర్తి ఎస్పీ అపూర్వ రావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ ఎస్‌ఓటీ డీసీపీ సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్, రాచకొండ ఐటీ సెల్ శ్రీధర్ రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

డిసెంబర్‌ 27న దిశ హత్యాచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం నలుగురు నిందితులను పోలీసులు విచారించేందుకు దిశను తగులబెట్టిన ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. ఈనెల 6న తెల్లవారుజామున నిందితులు తమ వద్ద ఉన్న తుపాకులను లాక్కుని వారి మీద రాళ్లతో దాడి చేశారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. నిందితులు కాల్పులు జరపడంతో పోలీసులు ప్రాణరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారని తెలిపారు. దీనిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
First published: December 9, 2019, 5:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading