సెలవు కావాలా.. అయితే పక్కలోకి రావాల్సిందే.. ఆర్టీసీ డిపో మేనేజర్ హుకుం..

సెలవు కావాలంటే.. తన కోరిక తీర్చాలంటూ ఆదేశిస్తున్నాడు. కనీసం వయస్సు తేడా లేకుండా డ్యూటీ దిగాక తన రూమ్‌కు వచ్చి వెళ్లాలంటూ హుకుం జారీ చేస్తున్నాడు.

news18-telugu
Updated: July 31, 2020, 12:51 PM IST
సెలవు కావాలా.. అయితే పక్కలోకి రావాల్సిందే.. ఆర్టీసీ డిపో మేనేజర్ హుకుం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్టీసీ బస్ డిపో. అక్కడ పనిచేసే ఓ అధికారి తన కిందిస్థాయి మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ డిపో పరిధిలో పనిచేసే పలువురి మహిళల నంబర్లు తీసుకుని వారితో అసభ్యంగా చాటింగ్ చేస్తున్నాడు. డ్యూటీ దిగాక రూమ్‌కి వచ్చి వెళ్లాలంటూ హుకూం జారీ చేస్తున్నాడు. ఏవరైనా సెలవు కావాలని అడిగితే.. పక్కలోకి వచ్చి తన కోరిక తీర్చాలంటూ ఆదేశిస్తున్నాడు. లేకుంటే ప్రమోషన్ జాబితాలో పేరు లేకుండా చేస్తా అంటూ కొందరినీ.. లాంగ్ డ్రైవ్‌లు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తానంటూ మరికొంతమందిని మహిళా ఉద్యోగినులను వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగిని సదరు అధికారి వేధింపులను భరించలేకపోయింది. తనను వేధిస్తున్న తీరును బయటి పెట్టి అధికారి బాగోతాన్ని బయటబయలు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఈశ్వరరావు పనిచేస్తున్నాడు. ఈ డిపో పరిధిలో పనిచేస్తున్న ఈయన మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నాడు. వారి నంబర్లు సేకరించి అసభ్యంగా చాటింగ్ చేస్తున్నాడు.

సెలవు కావాలంటే.. తన కోరిక తీర్చాలంటూ ఆదేశిస్తున్నాడు. కనీసం వయస్సు తేడా లేకుండా డ్యూటీ దిగాక తన రూమ్‌కు వచ్చి వెళ్లాలంటూ హుకుం జారీ చేస్తున్నాడు. తాను చెప్పినట్టు వింటే.. పర్యాటక ప్రాంతాలు, లాంగ్ డ్రైవ్‌లు అంటూ మాయమాటలు చెప్పి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఓ మహిళను తన కోరిక తీర్చాలని, లేకపోతే ప్రమోషన్ లిస్టులో పేరు లేకుండా చేస్తానని బెదిరించాడు. ఈ వ్యవహారం డైరెక్టర్ స్థాయి అధికారుల వరకు వెళ్లినా అతడిపై ఏలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. దీంతో సదరు డిపో మేనేజర్ మరింతగా రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులంతా ఒకరి తర్వాత మరొకరు బయటకు వచ్చి ఈశ్వరరావు బాగోతాన్ని బయటపెట్టి.. తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 31, 2020, 12:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading