మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిప్పంటించుకొని బాధితురాలు ఆత్మహత్య

సందీప్ హసానేతో పాటు నీలేశ్, అజయ్ నెల రోజుల క్రితం క్యాటరింగ్ ఆఫీులో తనపై అత్యాచారం చేశారని సూసైడ్ నోట్‌లో బాధితురాలు పేర్కొంది. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు అందులో రాసింది.

news18-telugu
Updated: February 26, 2020, 7:05 PM IST
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిప్పంటించుకొని బాధితురాలు ఆత్మహత్య
భర్తను బంధించి భార్య, కూతురిపై ఆరుగురి గ్యాంగ్ రేప్...
  • Share this:
కఠిన చట్టాలు తెచ్చినా.. ఉరిశిక్షలు పడుతున్నా.. దేశంలో అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బేతూల్ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ అవమానాన్ని, నిందితుల బెదిరింపులను భరించలేక బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. నెలరోజుల క్రితం అత్యాచారం జరగ్గా.. మంగళవారం ఆ బాలిక కిరోసిన్ పోసుకొని నిప్పటించుకోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల బాలిక బేతూల్‌లోని తన మేనమామ ఇంట్లో ఉంటూ 8వ తరగతి చదువుకుంటోంది. ఆర్థిక సమస్యల కారణంగా ఓ క్యాటరింగ్ గ్రూప్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తోంది. అక్కడ పనిచేసే సందీప్ హసానే, నీలేష్ నగ్లే, అజయ్ అనే ముగ్గురు యువకులతో పరిచయం ఏర్పడింది. వారి స్వస్థలం బేతూల్ జల్లా కల్దోంగ్రి. ఈ క్రమంలో మంగళవారం క్యాటరింగ్ పూర్తయిన తర్వాత ఇంటకి వెళ్లిన ఆ బాలిక.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగు వారు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. 95శాతం కలిన గాయాలతో బాధితురాలు చికిత్స పొందుతూ చనిపోయింది.

ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సందీప్ హసానేతో పాటు నీలేశ్, అజయ్ నెల రోజుల క్రితం క్యాటరింగ్ ఆఫీులో తనపై అత్యాచారం చేశారని సూసైడ్ నోట్‌లో బాధితురాలు పేర్కొంది. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు అందులో రాసింది. వారి టార్చర్‌ను, జరిగిన అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: February 26, 2020, 7:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading