బాలికని సెక్స్ కోసం అమ్మేసిన టీనేజర్... బుక్ చేసుకున్న ఐదుగురు

US crime : రోజులు బాలేదు అనేందుకు ఇదో ఉదాహరణ. టీనేజర్లే రకరకాల నేరాలు చేస్తూ... పెద్దవాళ్లకు షాకులిస్తున్నారు.

news18-telugu
Updated: August 15, 2020, 11:41 AM IST
బాలికని సెక్స్ కోసం అమ్మేసిన టీనేజర్... బుక్ చేసుకున్న ఐదుగురు
గర్ల్‌ఫ్రెండ్‌ని సెక్స్ కోసం అమ్మేసిన టీనేజర్... కొనుక్కున్న ఐదుగురు
  • Share this:
అమెరికాలో డేటింగ్ కామన్. దాన్ని అడ్డం పెట్టుకొని ఓ టీనేజర్ చేసిన నిర్వాకం ఇది. ఇది జరిగిన విధానం తెలుసుకుంటే... ఓ టీనేజరే ఇంత పనిచేశాడా అనిపించకమానదు. మియామీ పోలీసులు... 17 ఏళ్ల కుర్రాణ్ని అరెస్టు చేశారు. అతను చేసిన నేరమేంటంటే... 14 ఏళ్ల బాలికని సోషల్ మీడియాలో బేరం పెట్టాడు. డబ్బు, మత్తు పదార్థాల కోసం ఈ పని చేశాడు. ఇందులోనూ ఓ కండీషన్ పెట్టాడు. రోజుకు ఐదుగురితో డేటింగ్‌కి వెళ్లాలన్నాడు. అలాగైతేనే... డబ్బు బాగా వస్తుందనీ... లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందనీ... లేనిపోని కబుర్లు చెప్పి... ఆ బాలికను ఒప్పించాడు.

ఆ బాలిక జులైలో ఇంట్లో చిన్నపాటి వాదన తర్వాత ఇంట్లోంచీ పారిపోయింది. కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆగస్ట్ 11న ఆ బాలికను... ఓ మోటెల్‌లో సెక్స్ కోసం వాడుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అకౌంట్ ద్వారా... బాలికను సెక్స్ కోసం బుక్ చేసుకుంటున్నారని పోలీసులకు వివరించారు. దాంతో వెంటనే పోలీసులు ట్రాక్ చేసి... బాలికను కనిపెట్టారు.

ఇంటర్వ్యూలో పోలీసులకు ఆ బాలిక ఆశ్చర్యపోయే విషయాలు చెప్పింది. అలెక్సా అనే ఓ ఫ్రెండ్ తనను క్విన్‌టెరోకి పరిచయం చేసినట్లు చెప్పింది. ఆ క్వింటెరో... ఆమెను మోటెల్స్‌కి తీసుకెళ్లినట్లు వివరించింది. అక్కడ తనను సెక్స్ వృత్తిలో దించారని తెలిపింది. గంటకు రూ.18500 చొప్పున మనీ ఇచ్చారని వివరించింది.

డేటింగ్‌కి వెళ్లే ముందు క్వింటెరో ఆమెకు కొన్ని కండీషన్లు పెట్టాడు. మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలనీ, లేదంటే డేటింగ్ తర్వాత మనీ ఇవ్వకుండా ఎగ్గొడతారని చెప్పాడు. ఎప్పుడు డేట్‌కి వెళ్లినా... కండోమ్ తప్పనిసరిగా వాడాల్సిందేనని డిమాండ్ చెయ్యాలని చెప్పాడు. ఆ తర్వాత ఆమె కోసం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి... బేరం పెట్టాడు. ఒక్క రోజులో ఆమెతో ఐదుగుగు డేట్స్ డీల్స్ కుదుర్చుకున్నారు. ఇందుకోసం క్వింటెరో ఓ హోటల్ రూం బుక్ చేశాడు.

ఆ క్వింటెరో మైనర్. బాలిక సంపాదించిన డబ్బుతో పారిపోయాడు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మనుషుల అక్రమ రవాణా, డేటింగ్ కేసుల్లో పోలీసులు క్వింటెరోను అరెస్టుచేశారు. అతన్ని జువెనైల్ కేంద్రానికి తరలిస్తా్మని తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: August 15, 2020, 11:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading